
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా మారారు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్న “DC” సినిమాతో ఆయన హీరోగా అడుగుపెడుతున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్ లో లోకేష్ వైలెంట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Key Points
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా DC సినిమాలో అరంగేట్రం చేశారు.
కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా విడుదలైన DC టైటిల్ టీజర్ లో లోకేష్ వైలెంట్ లుక్ తో అదరగొట్టారు.
లోకేష్ హీరోగా మారిన ప్రయాణం
DC Title Glimpse: తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయన హీరోగా వస్తున్న ఫస్ట్ మూవీ DC. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన టైటిల్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. హీరోగా ఫస్ట్ మూవీలోనే అదరగొట్టేశాడు లోకేష్. టీజర్ మీరు కూడా చూసేయండి.
Nara Rohith: నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.. పెళ్లి తరువాత నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..
DC మూవీ: దర్శకుడు, సంగీతం, తారాగణం
వైలెంట్ లుక్ తో DC టైటిల్ టీజర్
లోకేష్ కనకరాజ్ హీరోగా మారడం, ఆయన మొదటి సినిమా DC టైటిల్ టీజర్ లో చూపించిన వైలెంట్ లుక్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా లోకేష్ కు హీరోగా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


