|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్‌గా చరిత్ర

Published: 02-07-2025, 11:26 PM

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అవార్డు లభించింది. ఈ అరుదైన గౌరవాన్ని అందుకునే తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.

Key Points

1

దీపికా పదుకొణె హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డుకు ఎంపికయ్యారు.

2

ఆమె ఈ అవార్డును అందుకునే తొలి భారతీయ నటి.

4

డెమి మూర్, ఎమిలీ బ్లంట్ వంటి ప్రముఖులతో పాటు దీపికా ఈ గౌరవాన్ని పొందుతున్నారు.

హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అవార్డు

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika padukone) మరో అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారతీయ సినీ రంగానికి గర్వకారణంగా నిలిచేలా, హాలీవుడ్‌ ప్రఖ్యాత ‘వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ (Walk of Fame star)’ అవార్డు కోసం ఎంపికయ్యారు. అంటే.. లాస్‌ ఏంజెలెస్‌లోని ఈ ప్రఖ్యాత ఫుట్‌పాత్‌పై ఆమె పేరు చెక్కించుకునే అరుదైన గౌరవాన్ని అందుకుంటున్నారు. దీంతో దీపిక ఈ గౌరవాన్ని అందుకోనున్న తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించారు.

తొలి భారతీయ నటిగా దీపికా

హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ క్లాస్‌ ఆఫ్‌ 2026లో భాగంగా ఆమె పేరును మోషన్‌ పిక్చర్‌ కేటగిరీలో ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 35 మంది ప్రముఖులు వివిధ రంగాల్లో (సినిమా, టీవీ, మ్యూజిక్‌, బ్రాడ్‌వే, కామెడీ) నుంచి ఎంపికయ్యారు. దీపికతో పాటు ఈ జాబితాలో డెమి మూర్‌, ఎమిలీ బ్లంట్‌, రాచెల్‌ మెక్‌అడమ్స్‌, రామీ మలెక్‌, టిమోథీ షాలమె వంటి అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన నటులు ఉన్నారు. కాగా, ప్రతి సంవత్సరం వందలాది నామినేషన్ల నుంచి అత్యుత్తములను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఎంపికైన వారిలో స్పోర్ట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టీవీ, థియేటర్‌, సంగీతం, సినిమా ఇలా ఐదు విభాగాల నుంచి ప్రతిభావంతులున్నారు.

2026 క్లాస్ ఆఫ్ వాక్ ఆఫ్ ఫేమ్

దీపిక పదుకొణె 2017లో విడుదలైన ‘XXX: Return of Xander Cage’ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె హాలీవుడ్‌ స్టార్‌ విన్‌ డీజిల్‌ సరసన నటించారు.ఈ అరుదైన గౌరవం భారతీయ సినిమాకు, ముఖ్యంగా మహిళా నటుల ప్రతిష్ఠకు ప్రపంచ వేదికపై మరింత వెలుగులు నింపింది. ఇక ఈ సందర్భంగా ఆమెకు సిని ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలుత చెబుతున్నారు. ఇక ప్రస్తుతం దీపికా బ్రహ్మాస్త్ర పార్ట్ టూ: దేవ్, కింగ్, కల్కి 2898 AD సీక్వెల్, పఠాన్ సీక్వెల్ తదితర మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు.

ఈ అరుదైన గౌరవంతో దీపికా పదుకొణె భారతీయ సినీ రంగానికి మరింత కీర్తిని తెచ్చిపెట్టింది. ఆమె భవిష్యత్ కెరీర్‌కు శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.