
ప్రభాస్ నటించే ‘స్పిరిట్’ మరియు ‘కల్కి 2’ చిత్రాల నుండి దీపికా పదుకొణె తప్పుకోవడం సంచలనం సృష్టించింది. రెమ్యునరేషన్ విషయంలో విభేదాలున్నాయని, ప్రభాస్ ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయి.
Key Points
దీపికా పదుకొణె 'స్పిరిట్' మరియు 'కల్కి 2' చిత్రాల నుండి తప్పుకుంది.
రెమ్యునరేషన్, డిమాండ్లపై విభేదాలు కారణమని వార్తలు.
ప్రభాస్ ఈ నిర్ణయంలో ప్రమేయం ఉందని వస్తున్న ఊహాగానాలు.
ప్రభాస్ టీం ఈ ఊహాగానాలను ఖండించింది.
దీపికా పదుకొణె చిత్రాల నుండి తప్పుకోవడం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊహించని విధంగా ఇటీవల వార్తల్లో నిలిచారు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ప్రారంభం కావలసి ఉంది. ఆ తర్వాత కల్కి చిత్రానికి సీక్వెల్ కల్కి 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించాల్సింది.
కానీ దీపికా రెండు చిత్రాల నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. ముందుగా స్పిరిట్ చిత్రం నుంచి తప్పుకుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా వైజయంతి మూవీస్ సంస్థ కూడా దీపికా కల్కి 2 చిత్రంలో నటించడం లేదని అధికారికంగా ప్రకటించింది. దీపికా రెమ్యునరేషన్, ఆమె పెట్టిన డిమాండ్ల విషయంలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
రెమ్యునరేషన్ వివాదం
ఇప్పుడు ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ , కల్కి 2 రెండు చిత్రాల నుంచి దీపికా తప్పుకోవడం వెనుక ప్రభాస్ హస్తం ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ వే. ప్రభాస్ ప్రమేయం లేకుండా ఏమీ జరగదు అనే రూమర్స్ వస్తున్నాయి.
ప్రభాస్ ని కార్నర్ చేస్తూ రూమర్స్ వస్తుండడంతో ఆయన టీం స్పందించినట్లు తెలుస్తోంది. స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి దీపికా తప్పుకోవడానికి.. ప్రభాస్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్ ప్రమేయంపై ఊహాగానాలు
దీపికా ఆ చిత్రాల నుంచి తప్పుకోవడం అనేది పూర్తిగా ఆమెకి, నిర్మాతలకు సంబంధించిన వ్యవహారం అని అంటున్నారు. అనవసరంగా ఈ వివాదంలోకి ప్రభాస్ ని లాగడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
దీపికా తప్పుకోవడానికి ప్రభాస్ కి సంబంధం లేదని ఆయన టీం స్పష్టం చేసింది. ఈ వివాదం అనవసరమని, నిర్మాతలు, దీపికా మధ్య విభేదాలే కారణమని తెలిపారు.


