|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Deepika Rangaraju : ప్లీజ్ నన్ను బిగ్ బాస్ కి పిలవండి.. నేను వస్తాను.. బ్రహ్మముడి సీరియల్ దీపికకు ఛాన్స్ ఇస్తారా?

Published: 13-07-2025, 10:00 PM

తెలుగు టీవీ సీరియల్‌లలో ప్రేక్షకులను అలరిస్తున్న దీపిక రంగరాజు, బిగ్ బాస్ షోలో పాల్గొనాలని తన కోరికను వ్యక్తం చేశారు. బ్రహ్మముడి సీరియల్ తర్వాతే బిగ్ బాస్ షోలో పాల్గొనడం సాధ్యమని చెప్పారు.

Key Points

1

దీపిక రంగరాజు బిగ్ బాస్ షోలో పాల్గొనాలని కోరుకుంటున్నారు.

2

ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో బిజీగా ఉన్నందున వెళ్లలేరు.

4

విన్నర్ గా నిలువాలని ఆమె ఆకాంక్ష.

దీపిక రంగరాజు బిగ్ బాస్ ఆసక్తి

Deepika Rangaraju : బిగ్ బాస్ ప్రతి సీజన్ లోను సీరియల్ నటీనటులు కూడా ఉంటారని తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ కి వెళ్లాలని, మరింత ఫేమ్ తెచ్చుకోవాలని అనుకుంటారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా బయట జనాల్లో ఫేమ్ ఉన్నవాళ్ళని కొంతమందిని తెస్తారు. కానీ ఈ నటిని పిలవట్లేదంట.

బ్రహ్మముడి సీరియల్ తో తెలుగులో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది తమిళ భామ దీపిక రంగరాజు. బ్రహ్మముడి సీరియల్ తో పాటు పలు టీవీ షోలు చేస్తూ తన అల్లరితో ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక బిగ్ బాస్ గురించి మాట్లాడింది.

బ్రహ్మముడి సీరియల్ పూర్తయిన తర్వాతే

దీపికా రంగరాజు బిగ్ బాస్ ఛాన్స్ గురించి మాట్లాడుతూ.. చాలా మంది నన్ను అడుగుతున్నారు బిగ్ బాస్ కి వెళ్తారా అని. ప్రస్తుతం అయితే బ్రహ్మముడి సీరియల్ ఉంది కాబట్టి వెళ్ళను. ఆ సీరియల్ అయ్యాకే వెళ్తాను. నాకు ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి కాల్ రాలేదు, వస్తే కచ్చితంగా వెళ్తాను. నాకు అయితే బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్, వెళ్లాలని కూడా ఉంది. నన్ను పిలవాలి అని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ కి వెళ్తే విన్నర్ టైటిల్ గెలవాలి. నాగార్జున గారు నా చేతిని పైకెత్తి విన్నర్ అని చెప్పాలి అని తెలిపింది.

విన్నర్ గా నిలవాలనే లక్ష్యం

దీంతో త్వరలో రాబోయే బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే దీపిక ఉండదు అని తెలుస్తుంది. మరి రాబోయే సీజన్స్ లో దీపికని బిగ్ బాస్ నిర్వాహకులు పిలుస్తారేమో చూడాలి.

ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‌తో బిజీగా ఉన్న దీపిక, బిగ్ బాస్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.