
📌 Key Points
- ధనుష్, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ ‘3’ మూవీతో మొదలైందని టాక్, ఆపై ప్రేమాయణం నడిచిందనే పుకార్లు.
- అమలా పాల్, ధనుష్ ‘వీఐపీ’ మూవీతో దగ్గరయ్యారనే వార్తలు, వీరిద్దరి రిలేషన్ షిప్ పై అనేక రూమర్స్.
- త్రిషతో ధనుష్ పార్టీలలో కనిపించడంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు, కానీ స్నేహితులు మాత్రమేనని క్లారిటీ.
- ‘తిరు’ మూవీ తర్వాత ధనుష్, నిత్యా మీనన్ పెళ్లి చేసుకుంటారని వార్తలు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. మృణాళ్ ఠాకూర్ కంటే ముందు ధనుష్ చాలామంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
శృతి హాసన్‌తో లవ్ ఎఫైర్ నిజమేనా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ హిట్ సినిమాలతో ఆయన దూసుకుపోతున్నారు. కెరీర్ ఎంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందో.. ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా ఆయన సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె ఐశ్వర్యతో 18 ఏళ్ల వైవాహిక సంబంధానికి స్వస్తి పలికారు.విడాకుల తర్వాత.. మృణాళ్ తో పరిచయం ఏర్పడిందని.. అది త్వరలోనే పెళ్లి చేసుకునేదాకా వెళ్లిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు ధనుష్ కానీ, మృణాళ్ కానీ స్పందించలేదు. కానీ.. ఈ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే.. ఇలాంటి రూమర్స్ ధనుష్ విషయంలో చాలాసార్లు వినిపించాయి. గతంలో ఇతర హీరోయిన్స్ తో ధనుష్ కి సంబంధం ఉందంటూ వార్తలు వచ్చాయి. మరి, ఆ హీరోయిన్లు ఎవరో ఓసారి చూద్దాం…
ధనుష్ సినిమా కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిన సినిమా 3. ఈ మూవీలో ధనుష్, శ్రుతి కెమిస్ట్రీ బాగా పండింది. దీంతో.. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు బాగా వచ్చాయి. వీరిద్దరి మధ్య రిలేషన్ కారణంగానే ధనుష్ కుటుంబ జీవితంలో మనస్పర్థలు వచ్చాయి అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే, ఈ వార్తలను శ్రుతి హాసన్ అప్పుడే ఖండించడం గమనార్హం.
అమలా పాల్ తో విడాకులకు కారణం ధనుషేనా?
రఘువరన్ బీటెక్, వీఐపీ సినిమాలో ధనుష్, అమలాపాల్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమయాణం మొదలైందంటూ వార్తలు వచ్చాయి. అమలాపాల్ విడాకులకు కూడా ఈ సినిమాలే కారణం అని రూమర్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత అమలపాల్ మరొకరిని పెళ్లి చేసుకోవడం గమనార్హం.
చాలా కాలం క్రితం ధనుష్ , త్రిష మధ్య మంచి స్నేహం ఉండేది. కొన్ని పార్టీల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో, వీరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వచ్చాయి. కానీ, వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులమని పలుమార్లు స్పష్టం చేశారు.
మృణాళ్ తో పెళ్లి వార్తల్లో నిజమెంత?
‘తిరుచిత్రంబలం’ (తెలుగులో ‘తిరు’) సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత, ధనుష్ , నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి అభిమానులు కూడా వీరు నిజ జీవితంలో ఒక్కటైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి.
ప్రస్తుతం ధనుష్ , మృణాళ్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు ఎలాంటి అధికారిక ఆధారం లేదు. వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని, ఆ క్రమంలోనే ఇద్దరి పేర్లు కలిపి ప్రచారం చేస్తున్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ధనుష్ ప్రస్తుతం తన దర్శకత్వంలో బిజీగా ఉండగా, మృణాళ్ తన పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
ధనుష్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. మృణాళ్ తో పెళ్లి వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


