
📌 Key Points
- రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ప్రపంచంలోనే #2 సినిమాగా రికార్డ్ సృష్టించింది.
- ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో ఆదివారం నాటికి 22 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.
- ఉత్తర అమెరికాలో 9.6 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్-3లో నిలిచిన ‘ధురంధర్ 2’.
- ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న రణ్‌వీర్ సినిమా.
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి వారాంతంలోనే భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతోంది. ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు మీకోసం.
ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్న ధురంధర్ 2
Dhurandhar 2 Is #2 Movie In World: ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధరంధర్ 2’ భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్స్ విషయంలో ప్రపంచంలోనే రెండో సినిమాగా రికార్డ్ కొట్టింది. తొలి స్థానంలో ఏది ఉందంటే?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధరంధర్ 2’ నామస్మరణే వినిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ధురంధర్ ది రివేంజ్ విడుదలైన మొదటి వారాంతంలోనే బాలీవుడ్ చరిత్రలో ఏ సినిమాకూ సాధ్యం కాని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలబడి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్‌లో హాలీవుడ్‌కు షాక్ ఇచ్చిన రణ్‌వీర్
ఓవర్సీస్ మార్కెట్‌లో కేవలం ఆదివారం (మార్చి 22) నాటికి 22 మిలియన్ డాలర్ల మైలురాయిని ధురంధర్ 2 చేరుకోవడం విశేషం. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో 9.6 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్-3 స్థానంలో నిలిచి హాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది ధురంధర్ ది రివేంజ్ మూవీ.
80 మిలియన్ డాలర్లతో వరల్డ్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ధురంధర్ 2 రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ (వారంలో 140 డాలర్లు) తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ధురంధర్ 2 కావడం విశేషం.
భారీ వసూళ్లతో రికార్డులు బద్దలు కొడుతున్న ‘ధురంధర్’
రణ్‌వీర్‌తో పాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ , రాకేష్ బేడీ తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 దూకుడు చూస్తుంటే మరిన్ని పాత రికార్డులు కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


