
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారత్-పాక్ ఉగ్రవాద కాన్సెప్ట్‌తో పూర్తి యాక్షన్‌తో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌వీర్ ఈ చిత్రంతో హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.
Key Points
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' మూవీ ట్రైలర్ విడుదలైంది.
భారత్ vs పాక్ ఉగ్రవాద కాన్సెప్ట్‌తో పూర్తి యాక్షన్‌తో రూపొందింది.
'ధురంధర్' డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.
రణ్‌వీర్ సింగ్ ‘హిట్’ టార్గెట్
గత కొన్నాళ్లుగా సినిమాలతై చేస్తున్నాడు గానీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కి సరైన హిట్ పడట్లేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్సయినట్లు ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘ఉరి’ మూవీ తీసిన ఆదిత్య ధర్‌తో కలిసి ఓ మూవీ చేశాడు. అదే ‘ధురంధర్’. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.
4 నిమిషాలకు పైగానే ఉన్న ట్రైలర్ చూడటానికి బాగుంది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలు, ఒళ్లు జలదరించే కొన్ని సీన్స్‌తో నింపేశారు. రణ్‌వీర్ సింగ్ హీరో కాగా ఇతడికి జోడీగా సారా అర్జున్ నటించింది. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరి ఈసారైనా రణ్‌వీర్ హిట్ కొడతాడేమో చూడాలి?
‘ధురంధర్’ ట్రైలర్ విశ్లేషణ
చిత్రం విడుదల, భారీ తారాగణం
‘ధురంధర్’ ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. భారీ తారాగణం, ఉత్కంఠభరితమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా రణ్‌వీర్ సింగ్‌కు కచ్చితంగా విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం. డిసెంబర్ 5న థియేటర్లలో చూడండి.


