|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఎస్పీ బాలు గొంతుకు చేతబడి? ఆ నరకపు పాట వెనుక అసలు నిజాలు బట్టబయలు!

Published: 18-03-2026, 5:35 AM
  • బాలు గొంతుకు చేతబడి జరిగిందని అనుమానించిన కుటుంబ సభ్యులు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
  • గీతాంజలి సినిమా సమయంలో బాలు గొంతులో సమస్యలు.. పాడలేక పోయిన పాట.
  • ఎస్పీబీ కెరీర్ లో నరకం చూపించిన పాటగా మిగిలిపోయిన ఒకానొక లాలి పాట.
  • ఆపరేషన్ వికటిస్తే కెరీర్ ఆగిపోతుందనే భయంతో బాలు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఒక లెజెండ్. ఆయన పాటలు ఎప్పటికీ మన హృదయాలలో నిలిచిపోతాయి. అయితే ఆయన జీవితంలో కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బాలు గొంతులో సమస్యలు: అసలేం జరిగింది?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతార.. ఇండియన్ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజ్ ను క్రియేట్ చేసుకున్న సింగర్. తన గొంతుతో ఎన్నో అద్భుతాలు చేసిన గాయకుడు. దాదాపు10 భాషల్లో.. 45 వేలకు పైగా పాటలు పాడిన గాయకుడు.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, ఇండస్ట్రీలు బాలు మావాడంటే.. మా వాడంటూ పోటీ పడుతుంటాయి. మలయాళంతో పాటు.. హిందీలో కూడా వందల, వేల పాటలు పాడిన అమరగాయకుడు.. నేడు మన మధ్య లేకున్నా.. పాట రూపంలో ప్రతీ ఇంట్లో వినిపిస్తూనే ఉన్నాడు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడు మాత్రమే కాదు..మల్టీ టాలెంటెడ్ స్టార్. గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా, నటుడిగా, నిర్మాతగా, హోస్ట్ గా, ఎన్నో రకాలుగా ఆయన ఇండస్ట్రీకి సేవలందించారు. 70 ఏళ్లు దాటినా.. ఏమాత్రం చెక్కు చెదరని గాత్రంతో .. పాటలు పాడుతూ వచ్చిన బాలునీ.. కరోనా మహమ్మారి బలితీసుకుంది. 2020 లో కరోనా కారణంగా బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బాలు మరణించినా.. ఆయన క్రియేట్ చేసిన రికార్డులు మాత్రం ఈ కాలంలో ఎవరు బ్రేక్ చేయలేరనే చెప్పాలి.

చేతబడి అనుమానాలు: కుటుంబ సభ్యుల ఆందోళన!

సాఫీగా సాగిపోయిన బాలు కెరీర్ లో .. ఓ ఇబ్బందికరపరిస్థితి వచ్చింది. గీతాంజలీ సినిమా టైమ్ లో బాలు గొంతు మారిపోయింది. గీతాంజలి తమిళం, మలయాళం డబ్బింగ్, సింగింగ్ టైమ్ లో బాలుకి సమస్య ఏర్పడింది. ఓ పాపా లాలి పాట పాడుతుండగా.. మెలోడీ సాంగ్ మధ్యలో జీరపడటంతో.. సాంగ్ పాడలేకపోయారు బాలసుబ్రహ్మణ్యం. ఆ ఒక్క పాట తన కెరీర్ లో నరకం అంటే ఏంటో చూపించిందని బాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతంలో గొంతు సమస్యతో బాధపడ్డారు. ఒకదశలో ఆయన పాటులు పాడగలనా లేదా అనే సందేహంతో భయపడ్డారు. బాలు గొంతులో చిన్న మొటిమ లాంటిది రావడంతో.. పాటులు పాడే సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంతో మెలోడియస్ గా ఉండే బాలు స్వరంలో.. అప్పుడప్పుడు జీరపోవడం, ఇబ్బందిపెట్టడం లాంటివి జరిగేవి. దాంతో ఎంతో సాహసం చేసి.. ఆయన గొంతుకు ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకున్నారు.

ఆపరేషన్ భయం: కెరీర్ పై నీలినీడలు!

ఎస్పీబీ గొంతుకి ఆపరేషన్ చేయిస్తే.. పాడగలడో లేదో తెలియదు. డాక్టర్లు మాత్రం నమ్మకం ఇవ్వడంలేదు. ఉన్న గొంతు కూడా పాడటానికి వీలు లేకుండా అయిపోతే ఎలా? బాలు బాధను చూసి.. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడ్డారు. ఆయన గొంతుకు ఎవరో ఏదో చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేయడంతో పాటు.. చేతబడి లాంటివి చేయించారేమో అని అనుమానంతో పూజలు.. హోమాలు, వ్రతాలు కూడా చేయించారట. ఈ విషయాన్ని స్వయంగా బాలు ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు. కానీ ఆయన ఇవన్నీ నమ్మలేదు. ఏది ఏమైన ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

బాలసుబ్రహ్మణ్యం ఆపరేషన్ చేయించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని చాలా మంది ఆయనకు సలహాలు ఇస్తూ వచ్చారు. ఇండియన్ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ కూడా.. బాలుకి ఫోన్ చేసి.. ” నిజమేనా.. సర్జరీకి వెళ్తున్నావట.. వద్దు అలా చేయొద్దు.. ఉన్న గొంతు పోగోట్టుకోవద్దు ” అని సలహా ఇచ్చారట. కానీ బాలు మాత్రం ఆపరేషన్ చేయించుకుని.. సాహసం చేశారు. తన గొంతుని మళ్లీ కాపాడుకున్నారు.

ఎస్పీ బాలు గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన ఎంతో బాధాకరమైనది. ఆయన గొంతు సమస్యలను ఎదుర్కొన్న తీరు స్ఫూర్తిదాయకం. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.