|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసిన ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్: న్యూ*డ్‌గా కనిపించిన హీరో, ఫ్యాన్స్ షాక్!

Published: 03-01-2026, 4:30 AM
  • ‘దిల్ దియా’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు.
  • పోస్టర్ లో హీరో చైతన్య రావు ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూ*డ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
  • డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో శ్రియాస్ చిత్రాస్, పూర్ణా నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
  • ఈ బోల్డ్ పోస్టర్ పై నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తూ, ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదలైన ‘దిల్ దియా’ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్టర్ లో హీరో చైతన్య రావు న్యూ*డ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ బోల్డ్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.

సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా పోస్టర్ విడుదల

Dil Diya Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)ఒకరు. ఈయన డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మూడు సినిమాలే అయినప్పటికీ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే హీరోని బోల్డ్ లుక్ లో చూపిస్తారని సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈయన ఓ సినిమా పోస్టర్ విడుదల చేశారు. ఇక సందీప్ రెడ్డివంగా చేతుల మీదుగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో హీరో కూడా న్యూ*డ్ లుక్ లో కనిపించడంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి సందీప్ రెడ్డి విడుదల చేసిన ఆ సినిమా పోస్టర్ ఏంటనే విషయానికి వస్తే..

డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో శ్రియాస్ చిత్రాస్, పూర్ణా నాయుడు ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “దిల్ దియా”(Dil Diya). ఈ సినిమాలో నటుడు చైతన్య రావు(Chaitanya Rao) మదాడి హీరోగా నటిస్తున్నారు. నిత్యం ఒకే తరహా సినిమాలు కాకుండా విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చైతన్య రావు మరోసారి దిల్ దియా సినిమా ద్వారా సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో చైతన్య రావు ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్ గా కనిపించారు. పొడిబాటి జుట్టు, గడ్డంతో సోఫాలో కూర్చుని ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. ఇలా ఈ పోస్టర్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ… పర్ఫెక్ట్ డైరెక్టర్ తో సరైన పోస్టర్ విడుదల చేయించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి కూడా తన సినిమాలలో హీరోలను దాదాపు ఈ తరహాలోనే చూయిస్తారనే సంగతి తెలిసిందే. ఇటీవల స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ పస్ట్ లు పోస్టర్ కూడా షర్టు లేకుండా ప్రభాస్ ను చూపించడంతో ఈ పోస్టర్ వైరల్ అయింది. ఇక త్వరలోనే దిల్ దియా సినిమాకు సంబంధించిన తదుపరి వివరాలను అధికారకంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.

న్యూ*డ్‌గా దర్శనమిచ్చిన హీరో చైతన్య రావు

Here’s the first look poster of my dear friend’s @bykranthi 5th film 🔥 WISHING YOU ALL THE LUCK 🤗 CONGRATULATIONS 🎊 Poster is very intriguing and deep 🤝 #DILDIYA @IamChaitanyarao @bykranthi @Ira_dayanand @PoornaNaiduProd @phanikalyang @pgvinda @beyondmediapres … pic.twitter.com/4YrwlglagQ

— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 3, 2026

‘దిల్ దియా’ పోస్టర్ పై నెటిజన్ల రియాక్షన్

చైతన్య రావు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కీడకోలా అనే సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన అన్నపూర్ణ ఫోటో స్టూడియో, ముఖ్య చిత్రం, జగమే మాయ, హనీమూన్ ఎక్స్ప్రెస్ వంటి పలు సినిమాలలో నటించారు. ఇక త్వరలోనే దిల్ దియా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాలో చాలా విభిన్న పాత్రలో చైతన్య రావు కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.2026 సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలు చిత్ర నిర్మాతలు ఉన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

‘దిల్ దియా’ పోస్టర్ లో చైతన్య రావు న్యూ*డ్‌గా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సందీప్ రెడ్డి వంగా విడుదల చేయడంతో మరింత వైరల్ అయింది. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ తదుపరి వివరాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.