|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దిల్‌ రాజు డ్రీమ్స్‌ అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌

Published: 28-06-2025, 8:15 PM

దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మరియు దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ అద్భుతమైన ప్లాట్‌ఫామ్ ను ప్రశంసించారు. ఈ వేదిక కొత్త ప్రతిభలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు అన్నారు.

Key Points

1

విజయ్ దేవరకొండ, దేవిశ్రీ ప్రసాద్ దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్ చేశారు.

2

కొత్త దర్శకులు, నిర్మాతలు, నటులకు అవకాశాలు కల్పించే వేదికగా దిల్ రాజు డ్రీమ్స్ పనిచేస్తుంది.

3

ఈ వెబ్‌సైట్ ద్వారా లక్షలాది మందికి కలలను నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది.

4

సినిమా రంగంలో విజయం సాధించాలంటే కష్టపడటం అవసరమని దిల్ రాజు అన్నారు.

దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్

‘‘కొత్త వాళ్లకి ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. ‘దిల్‌’రాజుగారికి ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ వెబ్‌ సైట్‌ని ఎందుకుప్రారంభించాలనిపించిందో నాకు తెలియదు. ఇది ఒక అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌. లక్షలాది మందికి ఒక నమ్మకాన్ని ఇచ్చింది. దరఖాస్తు చేసిన వారిలో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్‌ సైట్‌ లాంచ్‌కి న్యాయం జరిగినట్టే’’ అని హీరో విజయ్‌ దేవరకొండ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ వెబ్‌ సైట్‌ లాంచ్‌ ఈవెంట్‌కి విజయ్‌ దేవరకొండ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై, వెబ్‌ సైట్‌ని లాంచ్‌ చేశారు.

అనంతరం విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ–‘ ‘శేఖర్‌ కమ్ములగారి ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాకి నటుడిగా చాన్స్‌ కోసం అపై్ల చేశాను. దాదాపు 6 నెలలు వేచి చూశాను. 16 వేల అప్లికేషన్స్‌లో 11 మందిని ఎంపిక చేయగా వారిలో నేనూ ఉన్నాను. ఆ సినిమా నా జీవితంలో పెద్ద పాత్ర పోషించింది’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మన కలని సాకారం చేసుకోవడానికి సపోర్ట్‌ చేసేవారికంటే నిరుత్సాహపరిచే వారు ఎక్కువ మంది ఉంటారు. మన కలని, మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి’’ అని చెప్పారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్‌ ఉండదు. అలాంటి కొత్త టాలెంట్‌ కోసం సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ సంస్థనిప్రారంభించాం. మేము ఇక్కడికి రావడానికి 30 ఏళ్లు పట్టింది. ఇక్కడ సక్సెస్‌ అనేది ఒక్క శాతం మాత్రమే. ఎప్పుడైతే మీరు సినిమా రంగంలో సక్సెస్‌ అవుతున్నారని అర్థం అవుతుందో అప్పుడు 24 గంటలు కష్టపడాలి. నేను, విజయ్, దేవిశ్రీ, నాని… ఇలా అందరూ ఇండిపెండెంట్‌గా సక్సెస్‌ అయి వచ్చిన వాళ్లమే. అంతకుముందు జనరేషన్ లో చిరంజీవి, రజనీకాంత్‌గార్లు కూడా ఇండిపెండెంట్‌గానే సక్సెస్‌ సాధించారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇక్కడికి ఎంతోమంది ప్రతిభావంతులు వచ్చారు. మీరు ఎదిగాక ఇండస్ట్రీని మర్చిపోవద్దు’’ అని నిర్మాత శిరీష్‌ కోరారు.

విజయ్ దేవరకొండ, దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయాలు

కొత్త ప్రతిభలకు అవకాశం

దిల్ రాజు డ్రీమ్స్ వంటి వేదికలు కొత్త ప్రతిభలకు మంచి అవకాశాలను కల్పిస్తాయి. కష్టపడితే సినిమా రంగంలో విజయం సాధించవచ్చు అని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.