
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, గోదావరి జిల్లా ప్రజలకు సినిమాల్లో నటించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రాజమండ్రిలో జరుగబోయే ఆడిషన్స్ గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Key Points
దిల్ రాజు గోదావరి జిల్లా నటులకు బంపర్ ఆఫర్!
రాజమండ్రిలో జులై 10, 11, 12 తేదీల్లో ఆడిషన్స్
ఏజ్ లిమిట్, అనుభవం లేకున్నా పాల్గొనవచ్చు
సినిమా పట్ల అభిరుచి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి
దిల్ రాజు కాస్టింగ్ కాల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు.. సొంతంగా బ్యానర్ కూడా స్టార్ట్ చేసి.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తుంటారు. టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆదరించే వ్యక్తిగా ఎంతోమంది హీరోలను, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఈయన.. ఇప్పుడు మరో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు కాస్టింగ్ కాల్ నిర్వహించారు. ఆయన నిర్మాణ సంస్థ ‘దిల్ రాజు డ్రీమ్స్’ వేదికగా తెలియజేస్తూ.. ‘యాస ఒక్కటే కాదండి.. నరనరాల్లో మన గోదారోళ్ల ఎటకారంతో నిండిపోవాలండీ.. ఆయ్! దీని కోసం మేల్, ఫిమేల్ యాక్టర్స్ కావాలి. ఏజ్ లిమిట్ లేదు. మీ కోసం మేమే వస్తున్నామండీ.. మన రాజమండ్రికి’ అని తెలుపుతూ ఓ నోట్ షేర్ చేశారు.
‘జులై 10, 11, 12 తేదీల్లో 2గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడియన్స్ జరగనున్నట్లు తెలిపారు. 4వ అంతస్తు.. PVR బోటిక్ రూమ్స్, తిలక్ రోడ్. రాజమండ్రి. ఫోన్: 9666438129’ అంటూ అడ్రస్ కూడా పొందుపరిచారు. ఈ పోస్ట్‌కు ‘ఏజ్ లిమిట్ లేదు.. అనుభవం అవసరం లేదు.. సినిమా పట్ల స్వచ్ఛమైన అభిరుచి.. ఇంకా చూస్తారేంటండీ బాబు.. ఆడిషన్స్‌కి వచ్చేయండి!!’ అని తెలిపారు. లింక్
ఆడిషన్ వివరాలు
అర్హతలు
అందువల్ల, సినిమా రంగంలో అడుగుపెట్టాలనుకునే గోదావరి జిల్లా యువతకు ఇది అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


