
‘బలగం’ సినిమాతో పాపులర్ అయిన వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
Key Points
వేణు యెల్దండి 'బలగం' తర్వాత 'ఎల్లమ్మ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా 'ఎల్లమ్మ' చిత్రం తెరకెక్కనుంది.
ప్రాజెక్ట్ విషయంలో వేణు, దిల్ రాజు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రారంభంలో నానిని హీరోగా తీసుకోవాలని దిల్ రాజు భావించినట్లు వెల్లడించారు.
‘ఎల్లమ్మ’ చిత్రం తాజా అప్డేట్స్
జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వేణు యెల్దండి(Venu Yeldandi) ‘బలగం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో వేణు నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన ‘ఎల్లమ్మ’(yellamma) అనే ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్లు గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం.
దిల్ రాజు షాకింగ్ వ్యాఖ్యలు
ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇక ఇందులో నితిన్ (nithin)హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా? అప్డేట్స్ ఎప్పుడు విడుదల చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు (dil raju) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘వేణు ‘బలగం’ సినిమాను 55 రోజుల్లో చేశాడు. ‘ఎల్లమ్మ’ స్క్రిప్ట్ రాసినప్పటి నుంచి ‘తమ్ముడు’ మూవీలా చేద్దామని అంటున్నాడు.
వేణు, దిల్ రాజు మధ్య అభిప్రాయ భేదాలు
‘ఎల్లమ్మ’ విషయంలో వేణు నా మాట వినట్లేదు. నాకు ఆయనను ఒప్పించడానికే 6 నెలలు పట్టింది. వేణు రియాలిటీలోకి వచ్చి సినిమా చేద్దాం. నా ‘తమ్ముడు’ మూవీ సమయంలో నాన్ థియేట్రికల్ 45 వేసుకుంటే 35కు పడిపోయింది. మార్కెట్‌ను బట్టి మనం సినిమాను ఎలా తీయాలని హోమ్‌వర్క్ చేస్తాం. ఇంతకు ముందు ఎలా తీశాము ఇప్పుడు ఎలా తీయాలి అని ఓ నిర్ణయానికి వస్తాము. స్క్రిప్ట్‌ను బట్టి ఆఫీసులోనే లాక్ అయిపోవాలి. అయితే ఈ మూవీలో ముందుగా నాని తీసుకోవాలనుకున్నాము. ఆయనకున్న కమిట్‌మెంట్లలో ‘ప్యారడైజ్’ ఉందని చెప్పాడు. అందుకే నితిన్‌ను తీసుకున్నాము. ‘ఎల్లమ్మ’ను రియాలిటీతో చేయాలి. అన్ని కరెక్ట్‌గా సెట్ కావాలి’’ అని చెప్పుకొచ్చారు.
చివరగా, ‘ఎల్లమ్మ’ చిత్రం విషయంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


