
📌 Key Points
- పూజలతోనే స్టార్స్ అవుతారనేది నమ్మను అని డింపుల్ హయతి స్పష్టం చేసింది.
- సినిమా కెరీర్‌కు కష్టం, ఓపిక మాత్రమే అవసరమని డింపుల్ అభిప్రాయపడింది.
- ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
- గతంలో వేణు స్వామితో పూజలు చేయించుకున్న డింపుల్‌పై వచ్చిన ట్రోలింగ్‌కు సమాధానం.
టాలీవుడ్ నటి డింపుల్ హయతి పూజలు, స్టార్‌డమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వేణు స్వామిపై పరోక్షంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాలు వెల్లడించింది.
డింపుల్ హయతి ‘పూజలు-స్టార్‌డమ్’పై సంచలన అభిప్రాయం
పూజలు చేస్తే స్టార్స్ అవుతారు అనేది నేను నమ్మను.
ఎవరో ఎదో అన్నారనని ఏవి జరిగిపోవు
వేణు స్వామిపై డింపుల్ షాకింగ్ వ్యాఖ్యలకు కారణం?
వేణు స్వామిపై డింపుల్ షాకింగ్ కామెంట్స్
Dimple Hayathi: టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవి తేజ క్లాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల టెకెక్కిస్తున్నాడు. ఆషిక రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రమోషన్స్, ట్రోలింగ్
ఇందులో భాగంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ హయతి(Dimple Hayathi) వేణు స్వామి గురించి, తాను జరిపించిన పూజలపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.. ‘కేవలం పూజల వల్ల స్టార్స్ అయిపోతారు అంటే నేను నమ్మను. నేను, మా రెగ్యులర్ గా గుడికి వెళ్తాము. పెద్దవాళ్ళు చెప్పారని పూజలు కూడా చేస్తాము.
దేనికైనా సమయం రావాలి. అప్పుడే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎవరో ఏదో అన్నంత మాత్రాన, పూజలు చేసినంత మాత్రాన ఇక్కడ కెరీర్ మారిపోవడం అనేది జరగదు. ఇక్కడ కావాల్సింది కష్టం, ఓపిక అంతే. అయినా నేను ఏంటి అనేది నావాళ్ళకి తెలుసు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో డింపుల్ వేణు స్వామిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక గతం లో డింపుల్ వేణు స్వామితో పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే.
డింపుల్ హయతి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. పూజల ప్రభావం, కష్టపడే తత్వంపై ఆమె అభిప్రాయాలు వైరల్ అవుతున్నాయి. గతంలో వేణు స్వామితో ఆమెకు గల సంబంధం కూడా దీనికి కారణం.


