|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా కథ కాపీ కొట్టి సినిమా తీశారు.. దొంగలు దొరికిపోయారు: దర్శకుడి ఆగ్రహం

Published: 16-06-2025, 2:49 AM
నా కథ కాపీ కొట్టి సినిమా తీశారు.. దొంగలు దొరికిపోయారు: దర్శకుడి ఆగ్రహం

మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘తుడరుమ్‌’ కథ దొంగిలించబడిందని దర్శకుడు సనల్ కుమార్ శశిధరణ్ ఆరోపిస్తున్నారు. 2020లో రాసిన తన స్క్రిప్ట్ ‘తీయట్టం’ నుంచి కథాంశాన్ని కాపీ చేశారని ఆయన ఆరోపించారు. ఈ వార్త సినీ వర్గాలను షేక్ చేస్తోంది.

Key Points

1

మలయాళ సినిమా 'తుడరుమ్‌' కథ దొంగిలించబడిందని దర్శకుడు సనల్ కుమార్ శశిధరణ్ ఆరోపణ.

2

2020లో రాసిన 'తీయట్టం' స్క్రిప్ట్‌లోని ముఖ్యమైన అంశాలు 'తుడరుమ్‌'లో ఉపయోగించబడ్డాయి.

4

తన కథను త్వరలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని సనల్ కుమార్ ప్రకటించాడు.

‘తుడరుమ్‌’పై దర్శకుడి ఆరోపణలు

మలయాళంలో ఇటీవల బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన చిత్రం తుడరుమ్‌ ( Thudarum Movie ). మోహన్‌లాల్‌, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.230 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళ సినీచరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా తుడరుమ్‌ నిలిచింది. తరుణ్‌ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

2020లో రాసుకున్న కథ తాజాగా ఈ మూవీ చూసిన డైరెక్టర్‌ సనల్‌ కుమార్‌ శశిధరణ్‌ ( Sanal Kumar Sasidharan ) తుడరుమ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. 2020లో నేను ‘తీయట్టం’ అని ఓ స్క్రిప్ట్‌​ రాశాను. తుడరుమ్‌ చూస్తుంటే.. తీయట్టంలోని మూలకథను దొంగిలించినట్లే అనిపించింది. నా కథను చోరీ చేసి ఈ సినిమా రూపొందించారు. నా కథ సారాంశాన్ని గ్రహించేంత శక్తి వారికి లేకపోవడం వల్ల మూల కథ ఆత్మ ఇందులో చెక్కుచెదరకుండా కనిపిస్తోంది.

‘తీయట్టం’ మరియు ‘తుడరుమ్‌’ మధ్య సారూప్యత

డైలాగ్‌ కూడా నాదే! తీయట్టం కథ అంబి అనే ఆటో డ్రైవర్‌ చుట్టూ నడుస్తుంది. కొందరు ఓ వ్యక్తిని తల నరికి అతడి ఆటోలో పడేస్తారు. దీంతో ఈ హత్య కేసులో అంబి ఇరుక్కుంటాడు. ఇదే ప్రధాన కథ. నాకు మచ్చుకైనా చెప్పకుండా, ఎటువంటి క్రెడిట్‌ ఇవ్వకుండా దీన్ని కాస్త అటుఇటుగా మార్చేసి తుడరుమ్‌లో వాడుకున్నారు. అలాగే ఒరిజినల్‌లో.. నువ్వు చంపితే అది పాపం.. కానీ, తింటే అది శుద్ధి అవుతుంది అన్న డైలాగ్‌ను కూడా సందర్భం లేకపోయినా తుడురుమ్‌లో వాడుకున్నారు.

ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎంతో అనుభవమున్న దొంగలు కూడా  ఎవరికీ దొరకములే అన్న అతి విశ్వాసంతో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. తుడరుమ్‌లో ఈ డైలాగ్‌ను చేర్చడం చూస్తే నాకలాగే అనిపించింది. నేనెప్పుడో ఈ సినిమా చేయాల్సింది. మంజు వారియర్‌, టోవినో థామస్‌, మురళీ గోపి వంటి నటులతో ఈ మూవీ చేసేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఐదు సంవత్సరాలు అయిపోయినందున వారంతా దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. త్వరలోనే నా కథను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాను అని రాసుకొచ్చాడు.

సనల్ కుమార్ శశిధరణ్ ప్రకటన

దర్శకుడు సనల్ కుమార్ శశిధరణ్ తన కథను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ వివాదంపై మరింత స్పష్టత వస్తుందని ఆశిద్దాం. ‘తుడరుమ్‌’ చిత్ర బృందం ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.