|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దర్శకుడు RGV, యాంకర్ స్వప్నపై కేసు నమోదు

Published: 18-10-2025, 2:50 AM
దర్శకుడు RGV, యాంకర్ స్వప్నపై కేసు నమోదు

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదైంది. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడారని ఏపీకి చెందిన ఓ వ్యక్తి రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదు.

2

టీవీ ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లను కించపరిచారనే ఆరోపణ.

4

వివాదాస్పద చిత్రాలు, కేసులతో ఆర్జీవీకి మునుపటి చరిత్ర.

ఆర్జీవీ, స్వప్నపై ఫిర్యాదు వివరాలు

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదైంది. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లను కించపరుస్తూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడనని ఏపీకి చెందిన మేడా శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్ గోపాల్ వర్మతో పాటు అతడిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్వప్నపై సైతం రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే ఆర్జీవీ ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.

తరవాత బాలీవుడ్‌కు వెళ్లి షోలే లాంటి సినిమా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ తరవాత కాలంలో సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. చివరగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన రక్తచరిత్ర సినిమా ప్రేక్షలను ఆకట్టుకుంది. తరవాత కూడా కొన్ని సినిమాలు చేసినా అవి వివాదాస్పద చిత్రాలుగా నిలిచాయి తప్ప విజయం సాధించలేదు. ఇక ఇప్పటికే ఆయన పలు రాజకీయ వివాదాల కారణంగా కేసులు నమోదవ్వగా ఇప్పుడు మరో కేసు నమోదైంది.

దేవుళ్ళను కించపరిచారనే ఆరోపణలు

వివాదాలతో ఆర్జీవీ చరిత్ర

దేవుళ్లపై వ్యాఖ్యల కారణంగా నమోదైన ఈ తాజా కేసు ఆర్జీవీకి కొత్తకాదు. గతంలోనూ పలు వివాదాలు, కేసులతో వార్తల్లో నిలిచిన ఆయన, ఈ కేసులో ఎలాంటి స్పందన ఇస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.