|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: నన్ను, హీరోయిన్‌ను ఆడేసుకుంటున్నారు.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సంచలన కామెంట్స్!

Published: 06-04-2026, 9:05 AM
  • డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సంచలన కామెంట్స్: ట్రోల్స్ గురించి షాకింగ్ విషయాలు!
  • ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘LIK’ మూవీ!
  • ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం!
  • టాప్ డైరెక్టర్‌గా ఎదగడమే నా లక్ష్యం: విఘ్నేష్ శివన్

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తాజాగా చేసిన కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రోల్స్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు విఘ్నేష్ ఏమన్నారో చూద్దాం!

ట్రోల్స్‌పై విఘ్నేష్ శివన్ సీరియస్ కామెంట్స్!

విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘LIK’. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి జంటగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఇక విడుదల సమయం దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా విఘ్నేశ్ శివన్ ప్రొఫెనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘టాప్ లీగ్ డైరెక్టర్‌గా, ప్రతి హీరోకు ఫస్ట్ ఆప్షన్‌గా మారడం నా అతి పెద్ద కల. దాని కోసం నేను నా 100% ఎఫర్ట్ పెడుతున్నాను. మ్యూజిక్ విషయంలో అనిరుధ్ రవిచందర్ అందరికీ ఫస్ట్ ఛాయిస్ అయినట్టు, హీరోయిన్ విషయంలో నయనతారా టాప్‌లో ఉన్నట్టు, డైరెక్టర్స్‌లో ఎస్ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటి వారు తమ పీక్‌లో ఉన్నట్టు ఒక రోజు నేను కూడా ఆ స్థాయికి చేరుకుంటానని నమ్మకం ఉంది’ అని తెలిపారు.

అలాగే పర్సనల్ లైఫ్‌పై మాట్లాడుతూ.. ‘మన పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఏం వస్తుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. దానికి నా సమాధానమేంటంటే.. ఇప్పుడు నేను నయనతార, మా పిల్లలతో కలిసి ఓ ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశామనుకోండి.. ప్రతీదాన్ని ట్రోల్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై నేను, నయన్ సరదాగా మాట్లాడుకుంటాం. నిన్ను పెద్దగా ఏమీ అనట్లేదు కానీ నన్నైతే ఆడేసుకుంటున్నారు అని చెప్తుంటాను. అయితే.. ట్రోల్స్ చేసే వారు ఎలాగో మారరు. మనమే వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి’ అని చెప్పుకొచ్చాడు.

‘LIK’ మూవీ రిలీజ్‌కు సిద్ధం!

టాప్ డైరెక్టర్‌గా ఎదగడమే నా లక్ష్యం: విఘ్నేష్

విఘ్నేష్ శివన్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘LIK’ మూవీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.