|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డిష్యుం.. డిష్యుం

Published: 23-06-2025, 2:49 PM
డిష్యుం.. డిష్యుం

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్ మరియు రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Key Points

1

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా

2

మమితా బైజు హీరోయిన్, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో

4

సూర్య పాత్రలో విభిన్న షేడ్స్, నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని సమాచారం

సినిమా చిత్రీకరణ ప్రారంభం

డిష్యుం.. డిష్యుం.. అంటూ విలన్లను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్  ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్  సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని, కొన్ని సన్నివేశాల్లో నెగటివ్‌ షేడ్స్‌ కూడా కనిపిస్తాయనే టాక్‌ తెరపైకి వచ్చింది. సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

సూర్య పాత్ర విశేషాలు

రిలీజ్ తేదీ

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య, మమితా బైజుల కాంబినేషన్ మరియు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.