|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ సిరీస్‌తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి దివ్యా దత్తా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలి పాత్రలో 47 ఏళ్ల బ్యూటి!

Published: 03-08-2025, 2:42 AM
ఓటీటీ సిరీస్‌తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి దివ్యా దత్తా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలి పాత్రలో 47 ఏళ్ల బ్యూటి!

ప్రముఖ బాలీవుడ్ నటి దివ్యా దత్తా తన నటనతో ఎంతో మందిని మెప్పించింది. ఇప్పుడు ఆమె తెలుగు ఓటీటీ సిరీస్ ‘మయసభ’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలి పాత్రలో ఆమె నటన ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Key Points

1

బాలీవుడ్ నటి దివ్యా దత్తా తెలుగు ఓటీటీ సిరీస్ ‘మయసభ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం.

2

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్రను దివ్యా దత్తా పోషిస్తున్నట్లు వార్తలు.

4

దేవ కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో సాగుతుంది.

దివ్యా దత్తా తెలుగు ఓటీటీ ఎంట్రీ

బాలీవుడ్ పాపులర్ నటీమణుల్లో దివ్యా దత్తా ఒకరు. విభిన్న పాత్రలతో, అద్భుతమైన నటనతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది దివ్యా దత్తా. ఛావా, భాగ్ మిల్కా భాగ్, స్లీపింగ్ పార్టనర్, బద్లాపూర్, బాబుమొషాయి బందూక్‌బాజ్ వంటి ఎన్నో బాలీవుడ్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది దివ్యా దత్తా.

హిందీలో మంచి క్రేజ్ ఉన్న ఈ 47 ఏళ్ల బ్యూటి దివ్యా దత్తా ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ఓటీటీ సిరీస్‌ తో టాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేస్తోంది. దివ్యా దత్తా నటించిన లేటెస్ట్ తెలుగు పొలిటికల్ ఓటీటీ వెబ్ సిరీస్ మయసభ.

ప్రస్థానం , ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలను తెరకెక్కించిన పాపులర్ డైరెక్టర్ దేవ కట్టా మయసభ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఆయనతోపాటు ఈ సిరీస్‌కు కిరణ్ జయ కుమార్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రలు పోషించారు.

‘మయసభ’ సిరీస్ విశేషాలు

తెలుగు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప నేతలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహం, వైరం, పాలిటిక్స్ అంశాలతో మయసభను తెరకెక్కించినట్లు టీజర్, ట్రైలర్ కంటెంట్ చూస్తుంటే తెలుస్తోంది.

అలాంటి మయసభ ఓటీటీ సిరీస్‌లో బాలీవుడ్ నటి దివ్యా దత్తా కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో ఐరావతి అనే కీ రోల్ చేస్తోంది దివ్యా దత్తా. అయితే ఈ ఐరావతి పాత్ర అనేది కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీకి సంబంధించినదని టాక్ నడుస్తోంది.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన మయసభ ట్రైలర్‌లో సోనియా గాంధీ పాత్ర తరహాలో దివ్యా దత్తా కనిపించింది. ఇలాంటి ముఖ్య పాత్రతో తెలుగులో దివ్యా దత్తా ఎంట్రీ ఇస్తోంది. అయితే, ఇటీవల నిర్వహించిన మయసభ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దివ్యా దత్తా ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకుంది.

సోనియా గాంధీ పాత్రలో దివ్యా దత్తా

నటి దివ్యా దత్తా మాట్లాడుతూ .. “నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవ కట్టా గారికి థాంక్స్. ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం అరుదుగా వస్తుంటాయి. తెలుగులో ఇది నాకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంత మంచి ప్రాజెక్ట్‌తో తెలుగులోకి వస్తుండటం ఆనందంగా ఉంది” అని తెలిపింది.

“మయసభ సెట్‌‌లో సరదాగా అందరం కలిసి నటించాం. ఈ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను” అని బ్యూటిపుల్ దివ్యా దత్తా చెప్పుకొచ్చింది.

మొత్తంగా, దివ్యా దత్తా తెలుగు ఓటీటీ ప్రవేశంతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిద్దాం. మయసభ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.