|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒడిశాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎర: బీజేపీ ఆపరేషన్ లోటస్ బాగోతం బట్టబయలు చేసిన డీకే శివకుమార్!

Published: 15-03-2026, 5:05 PM
  • ఒడిశాలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ప్రారంభించిందని డీకే శివకుమార్ ఆరోపణ.
  • ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఆఫర్ చేశారని సంచలన ఆరోపణలు.
  • క్రాస్ ఓటింగ్ కోసం నలుగురు వ్యక్తులు ఎమ్మెల్యేలను సంప్రదించారని వెల్లడి.
  • ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఒడిశాలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ప్రారంభించిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భారీగా డబ్బు ఆఫర్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.

డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ( DK Shiva kumar) సంచలన ఆరోపణలు చేశారు. ఒడిశా రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ కు భారతీయ జనతా పార్టీ తెరలేపిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ్యసభ ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఐదు కోట్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కూడా సంచలన ఆరోపణలు చేశారు.

ఒడిశాలో ‘ఆపరేషన్ లోటస్’ కుట్ర

తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గెలవాలని భారతీయ జనతా పార్టీ కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. ఇది భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ లోటస్ లో భాగమని సీరియస్ అయ్యారు. క్రాస్ ఓటింగ్ చేయాలని నలుగురు వ్యక్తులు తమ ఎమ్మెల్యేలను కాంట్రాక్టు చేశారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు కూడా చేసినట్లు వెల్లడించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు డీకే శివకుమార్. దీంతో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ త‌రుణంలోనే ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగ‌ళూరులోని ఓ రిసార్టుకు కూడా అధిష్టానం త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం.

పోలీసుల అదుపులో నిందితులు

A post shared by India Today (@indiatoday)

డీకే శివకుమార్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.