|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘డాన్ బాస్కో’ ఫస్ట్ లుక్: రీయూనియన్ వెనుక ఇంత కథ ఉందా? దిమ్మతిరిగే ట్విస్ట్!

Published: 28-03-2026, 8:35 AM
  • ‘డాన్ బాస్కో’ చిత్రం రీయూనియన్ నేపథ్యంలో విముక్తి గురించి చెప్పనుంది.
  • వెంకట్ ఉప్పుటూరి దర్శకత్వంలో రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
  • హీరోగా రుష్య దత్త, హీరోయిన్‌గా మిర్నా మీనన్ నటిస్తున్నారు.
  • ఫస్ట్ లుక్‌లో రుష్య దత్త స్టైలిష్‌గా కత్తి పట్టుకుని కనిపిస్తున్నారు.

వెంకట్ ఉప్పుటూరి దర్శకత్వంలో రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘డాన్ బాస్కో’. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. రుష్య దత్త, మిర్నా మీనన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం రీయూనియన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

‘డాన్ బాస్కో’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

Don Bosko: ‘ప్రతి రీయూనియన్ జ్ఞాపకాల కోసమే కాదు.. కొన్ని విముక్తి (రిడెంప్షన్) కోసం కూడా ఉంటాయి’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న చిత్రం ‘డాన్ బాస్కో’ (Don Bosko). రీయూనియన్ అంటే, పాత స్నేహితులను కలుసుకోవడం, జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం వరకే అందరికీ తెలుసు. కానీ, కొన్ని విముక్తి‌ని కూడా కలిగిస్తాయని అంటున్నాడు ఈ చిత్ర దర్శకుడు. ఎమర్జింగ్ ప్రొడక్షన్ హౌస్ రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Radha Krishna Entertainments) సంస్థ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. విదేశాల్లో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను విజయవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ఇది. ఇప్పుడీ సంస్థ వెంకట్ ఉప్పుటూరి (Venkat Upputuri) దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బోస్కో’ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు.

హీరో హీరోయిన్లుగా రుష్య దత్త, మిర్నా మీనన్

యంగ్ హీరో రుష్య దత్త (Rushya Datta) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుపుతూ.. శ‌నివారం మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేశారు. ‘జైలర్, నా సామి రంగ’ సినిమాలతో గుర్తింపు పొందిన అందాల భామ మిర్నా మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రుష్య ద‌త్త‌ స్టైలిష్‌గా కనిపిస్తూ, ఒక చేతిలో కటానా లాంటి కత్తిని పట్టుకుని, మరో చేతితో కాలర్‌ను పైకెత్తుతూ బోల్డ్ పోజ్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా క్యాప్షన్ విషయానికి వస్తే..

రీయూనియన్ జ్ఞాపకాల వెనుక విముక్తి కథ

‘ప్రతి రీయూనియన్ జ్ఞాపకాల కోసమే కాదు.. కొన్ని విముక్తి (రిడెంప్షన్) కోసం కూడా ఉంటాయి’ అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంతకు ముందు వచ్చిన సినిమాలు హిట్‌తో పనిలేకుండా మంచి ఆదరణను అందుకున్నాయి. ‘నా ఆటోగ్రాఫ్, జాను’ వంటి చిత్రాలకు ఫ్యాన్ కాని వారెవ్వరు. ఈ ట్యాగ్‌లైన్ చూస్తుంటే, ఆ సినిమాలకు మించిన పాయింట్ ఏదో ఇందులో చెప్పబోతున్నారనేది అర్థమవుతోంది. ఇందులో మురళీ శర్మ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ పాత్రలో కీలక పాత్ర పోషిస్తుండగా.. మిర్నా మీనన్ లెక్చరర్ సుమతి పాత్రలో కనిపించనుంది. మౌనిక, రాజ్‌కుమార్ కసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క‌చ్చితంగా ఈ మూవీ మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా మెప్పించ‌నుంద‌నే హ‌మీని మేకర్స్ ఇస్తున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తామని ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు.

మొత్తానికి ‘డాన్ బాస్కో’ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. రుష్య దత్త లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.