|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇలాంటివి చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా.. సన్నీ డియోల్ ఫైర్

Published: 14-11-2025, 3:20 AM

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై ఇటీవల తప్పుడు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇంటి వద్ద ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా, మీడియా మొత్తం గుమిగూడింది. దీనిపై సన్నీ డియోల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Key Points

1

ధర్మేంద్ర ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు వార్తలపై కుటుంబం ఆందోళన చెందింది.

2

ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటి వద్దే ధర్మేంద్ర చికిత్స పొందుతున్నారు.

4

కుటుంబ గోప్యతను గౌరవించాలని, తప్పుడు వార్తలు రాయొద్దని సన్నీ డియోల్ విజ్ఞప్తి చేశారు.

ధర్మేంద్ర ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ఇటీవల ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈక్రమంలోనే ఆయన మరణించారంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలే ఆందోళన చెందారు. ఇక ఈ వార్తలు వైరల్ అయిన తర్వాత ఆయన కూతురు ఈషా దేవోల్ స్పందించి తన తండ్రి చనిపోలేదని తప్పుడు వార్తలు రాయొద్దని కోరింది. హాస్పిటల్‌లో ఉంటే ఇలాంటి వార్తలు ఆయనను బాధిస్తాయని కుటుంబం కీలక నిర్ణయం తీసుకున్నారు.

కుటుంబ గోప్యతను ఉల్లంఘించిన మీడియా

ధర్మేంద్రకు ఇంటి వద్దే చికిత్స అందించాలని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. మీడియా మొత్తం ఆయన ఇంటి ముందు చేరారు. దీంతో అది చూసిన ఆయన కుమారుడు సన్నీ డియోల్ (Sunny Deol)ఫుల్ ఫైర్ అయ్యాడు. ‘‘మా కుటుంబ గోప్యతకు గౌరవం ఇవ్వాలంటూ మీడియాపై మండిపడ్డారు. అలాగే మీ అందరికీ కూడా ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దండం పెడుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సన్నీ డియోల్ ఆగ్రహం: తప్పు వార్తలపై మండిపాటు

A post shared by IWMBuzz (@iwmbuzz)

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, ఆరోగ్య వివరాలపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కుటుంబ గోప్యతను గౌరవించాలని సన్నీ డియోల్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన సినీ లోకంలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.