
చిరంజీవి, వెంకటేశ్‌లకు ఈ నెల నిజంగానే డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు. చెన్నైలో జరిగిన ‘క్లాస్ ఆఫ్ 80స్’ రీ యూనియన్ వేడుకలో ఇద్దరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాదు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌తోపాటు ఒక సెలబ్రేషన్ సాంగ్ ప్లాన్ చేశారు.
Key Points
చిరంజీవి, వెంకటేశ్ చెన్నైలో ‘క్లాస్ ఆఫ్ 80స్’ రీ యూనియన్‌కి హాజరయ్యారు.
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాలో వెంకటేశ్ కీలక పాత్రలో.
వచ్చే వారం ఇద్దరిపై సెలబ్రేషన్ సాంగ్ చిత్రీకరణకు ప్రణాళిక.
సెట్స్‌లో చిరంజీవి, వెంకటేశ్‌లను చూసేందుకు ఆసక్తిగా ఉన్నానన్న అనిల్ రావిపూడి.
‘క్లాస్ ఆఫ్ 80స్’ రీ యూనియన్
ఇక్కడున్న ఫొటోలో మంచి జోష్‌తో ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు చిరంజీవి, వెంకటేశ్. ఇంతకీ ఈ జోష్‌కి కారణం ఏంటంటే… స్నేహితులను కలవడానికి వెళ్లారు. ప్రతి ఏడాది ‘క్లాస్ ఆఫ్ 80స్’ అంటూ 1980స్‌కి చెందిన నటీనటులందరూ కలిసి, సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్, ప్లేస్ ఉంటుంది. ఈసారి రీ యూనియన్‌కి చెన్నై వేదికైంది.
చిరంజీవి, వెంకటేశ్‌ల కొత్త సినిమా
ఇందు కోసమే చిరంజీవి, వెంకటేశ్ శనివారం హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం అయ్యారు. ఇదిలా ఉంటే… చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో ఓ కీలకపాత్రలో వెంకటేశ్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను, ఓ సెలబ్రేషన్ సాంగ్‌ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.
అనిల్ రావిపూడి ప్లాన్స్, అంచనాలు
‘‘చిరంజీవి, వెంకటేశ్‌గార్లను కలిసి సెట్స్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇటు రీ యూనియన్ సెలబ్రేషన్స్ అటు సెట్స్‌లో సెలబ్రేషన్ సాంగ్… ఇలా ఈ నెల చిరంజీవి, వెంకటేశ్‌కు డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు.
ఒకవైపు స్నేహితులతో రీ యూనియన్ వేడుకలు, మరోవైపు సెట్స్‌లో సెలబ్రేషన్ సాంగ్… ఇలా ఈ నెల మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌లకు మరింత ప్రత్యేకంగా మారింది. అభిమానులు వీరి డబుల్ సెలబ్రేషన్స్‌ను ఎంజాయ్ చేయడం ఖాయం.


