|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డ్రగ్స్ కేసు.. మరో నటుడు కృష్ణ కోసం పోలీసుల గాలింపు చర్యలు

Published: 25-06-2025, 4:04 AM

సినిమా ఇండస్ట్రీలో మరో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. నటుడు శ్రీరామ్ అరెస్టు తర్వాత, పోలీసులు మరో నటుడు కృష్ణ కోసం గాలిస్తున్నారు. కృష్ణ పరారీలో ఉన్నాడు. ఈ కేసుతో సినీ ఇండస్ట్రీలో అలజడి నెలకొంది.

Key Points

1

నటుడు శ్రీరామ్ అరెస్టుతో డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి.

2

నటుడు కృష్ణ పరారీలో ఉన్నాడు, అతని కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

4

సినిమా ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ కేసు వణికిస్తుంది.

శ్రీరామ్ అరెస్టుతో కీలక వివరాలు బయటపడ్డాయి

సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు (Drug case) వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయిన నటుడు శ్రీరామ్ (Actor Sriram) ఇచ్చిన సమాచారంతో నటుడు కృష్ణ (Actor Krishna) కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ నెల 23న చెన్నైలోని నుంగంబాక్కం పోలీసులు శ్రీరామ్ అరెస్టు చేశారు. ఈ కేసు మాజీ AIADMK ఐటీ విభాగం సభ్యుడు T. ప్రసాద్‌తో ముడిపడి ఉంది. ఆయన శ్రీకాంత్‌కు కొకైన్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మంగళవారం నటుడు శ్రీరామ్‌ను పోలీసు విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

9 గంటలకు పైగా విచారించారణలో శ్రీరామ్.. తనతో పాటు డ్రగ్స్ తీసుకున్న వారి పేర్లను పోలీసులు చెప్పాడు. వారిలో తమిళ సినిమా ఇండస్ట్రీ (Tamil film industry)కి చెందిన నటుడు కృష్ణ కూడా ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే శ్రీరామ్ అరెస్ట్ అయిన వెంటనై అజ్ఞాతంలోకి వెళిన శ్రీ కృష్ణ ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. దీంతో పోలీసులు ఆయన్ను ఎలాగైన పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలోని అనేక యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో అతని అరెస్టు అనివార్యం అయింది. దీంతో సినిమా ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ కేసు ఆందోళన కలిగిస్తుంది.

నటుడు కృష్ణ పరారీలో

సినిమా ఇండస్ట్రీపై డ్రగ్స్ కేసు నీడ

నటుడు కృష్ణ అరెస్టుతో ఈ డ్రగ్స్ కేసుకు మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా తగిన చర్యలు తీసుకోవడం అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.