|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుల్కర్ సల్మాన్ మూవీ: హీరోయిన్ ఎవరో చూస్తే షాక్! టాలీవుడ్‌కు దొరికిన మరో తార!

Published: 19-01-2026, 2:15 AM
దుల్కర్ సల్మాన్ మూవీ: హీరోయిన్ ఎవరో చూస్తే షాక్! టాలీవుడ్‌కు దొరికిన మరో తార!
  • దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ మూవీ నుంచి హీరోయిన్ సాత్విక ఫస్ట్ లుక్ విడుదల!
  • పవన్ సాదినేని దర్శకత్వం, గీతా ఆర్ట్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం!
  • తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘ఆకాశంలో ఒక తార’ మూవీ!
  • జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు!

టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఒక్కసారి చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

దుల్కర్ మూవీలో తెలుగమ్మాయి!

దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Akasamlo Oka Tara). దర్శకుడు పవన్ సాదినేని(Pawan Sadineni) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్లు సమర్పిస్తుండగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక దీనికి జి.వి.ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. ఇక సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఫస్ట్ లుక్‌తో ఫిదా చేసిన హీరోయిన్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి తెలుగు హీరోయిన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మూవీ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా .. ‘ఆమె ఆకాశం కంటే పెద్ద కలను మోస్తుంది.. ఆకాశంలో ఒక తారకు రెక్కలు ఇచ్చే కలలు కనే సాత్విక వీరవల్లిని పరిచయం చేస్తున్నాము ’ అని రాసుకొస్తూ ఆమె పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక పోస్టర్‌లో హీరోయిన్ సాత్విక లంగా ఓణీ కట్టుకొని పెద్ద పెద్ద కళ్లతో, మెడలో నల్ల పూసలు, పసుపుతాడు, నుదుటన బొట్టు పెట్టుకొని రైల్లో ఓ సీటులో కూర్చొంది. చూడటానికి చాలా సంప్రదాయ గృహిణిగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

పాన్ ఇండియా మూవీగా ‘ఆకాశంలో ఒక తార’

A post shared by Geetha Arts (@geethaarts)

‘ఆకాశంలో ఒక తార’ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.