
📌 Key Points
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు రూ. 34.75 కోట్లు వసూలు చేసినా, రెండో రోజు రూ. 9.25 కోట్లకు పడిపోయింది.
- ‘ధురందర్ 2’ రెండు రోజుల్లోనే రూ. 226 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది.
- పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ సరిపోవని, కంటెంట్ కూడా ముఖ్యమని ప్రేక్షకులు తేల్చి చెప్పారు.
- దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ప్రమోషన్ల కొరత ఉస్తాద్‌కు ప్రతికూలంగా మారాయి.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. ‘ధురందర్ 2’ విడుదల కావడంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీనిపై ట్రేడ్ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నాయి.
ఉస్తాద్‌కు ధురందర్ 2 షాక్: కలెక్షన్లలో భారీ పతనం
Durandhar-2 vs Ustaad: పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఒక సునామీ రావాలి. కానీ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రం ఆ సునామీలో చిక్కుకున్న ఒక చిన్న పడవలా కనిపిస్తోంది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఊదరగొట్టిన మేకర్స్, ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు చూసి ముఖం చాటేస్తున్నారు. ధురందర్ 2 వంటి ఒక మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ వస్తుందని తెలిసి కూడా, అదే రోజున ఉస్తాద్‌ను బరిలోకి దింపడం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద ‘బ్లండర్’ అని ట్రేడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ఓపెనింగ్స్ లో పవర్.. రెండో రోజే తుస్!
మొదటి రోజు ఎలాగోలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండతో రూ.34.75 కోట్లు రాబట్టిన ఉస్తాద్, రెండో రోజు వచ్చేసరికి అడ్రస్ లేకుండా పోయాడు. కేవలం రూ.9.25 కోట్లకు పడిపోవడం అంటే ఇది సాదాసీదా డ్రాప్ కాదు.. ‘డిజాస్టర్’ సంకేతం. మరోవైపు ధురందర్ 2 కేవలం రెండు రోజుల్లోనే రూ.226 కోట్ల నెట్ వసూళ్లతో ఇండియాను షేక్ చేస్తుంటే, ఉస్తాద్ కనీసం రూ.50 కోట్ల మార్కును దాటడానికి కూడా తంటాలు పడుతున్నాడు.ఇక మల్టీప్లెక్స్ లలో ధురందర్2 డామినేషన్ చూస్తుంటే, ఉస్తాద్ కేవలం సింగిల్ స్క్రీన్లకే పరిమితమైనట్టు కనిపిస్తోంది.
రెండో రోజే ఉస్తాద్ కలెక్షన్లు డౌన్.. కారణాలివేనా?
ధురందర్ సునామీలో కొట్టుకుపోయిన ఉస్తాద్ భగత్ సింగ్!
నిజానికి యష్ ‘టాక్సిక్’ తప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ కి లైన్ క్లియర్ అయ్యిందని సంబరపడ్డారు. కానీ ధురందర్ 2 రూపంలో అంతకంటే పెద్ద గండం ఎదురైంది. అసలు క్లాష్ గురించి తెలిసినా యష్ తన సినిమాను జూన్ కి పోస్ట్ పోన్ చేసుకుని తెలివైన పని చేశాడు. కానీ ఉస్తాద్ టీమ్ మాత్రం అతివిశ్వాసంతో వచ్చి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో కూడా ఉస్తాద్ షోలు క్యాన్సిల్ అయ్యి ధురందర్ కి మారుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫ్యాన్స్ కి మాత్రమేనా? కామన్ ఆడియన్స్ రిజెక్ట్ చేశారా?
ఫ్యాన్స్ అండ ఉన్నా ఫలితం లేదాయే.. కారణం?
కేవలం పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ చూపిస్తే సరిపోదని, కంటెంట్ లో దమ్ము ఉండాలని ప్రేక్షకులు ఈ సినిమాతో తేల్చి చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా రొటీన్ గా ఉండటం, ప్రమోషన్ల కోసం టైమ్ లేకపోవడం ఉస్తాద్‌కి పెద్ద మైనస్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ‘OG’ లాంటి సినిమాతో మొదటి రోజే రూ.90 కోట్లు వసూలు చేసిన రికార్డు ఉంది, కానీ ఇప్పుడు ఈ చిన్న వసూళ్లతో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ‘రాంగ్ డెసిషన్’ గా మిగిలిపోనుంది. ఏదేమైనా సోమవారం నాటికి ఉస్తాద్ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చాపచుట్టేయడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఒకరకంగా ధురందర్ 2 ప్రభంజనం ముందు ఉస్తాద్ నిలబడలేక చేతులెత్తేయడం పవర్ స్టార్ అభిమానులకు మింగుడుపడని నిజం.మొత్తానికి ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.“కంటెంట్ ఎంత బలంగా ఉన్నా… రిలీజ్ టైమింగ్ తప్పితే పెద్ద సినిమాకైనా బాక్సాఫీస్ వద్ద కష్టాలు తప్పవు.”అని !
మొత్తానికి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరిచింది. భవిష్యత్తులో పవన్ ఎలాంటి సినిమాలు ఎంచుకుంటారో చూడాలి.


