
📌 Key Points
- నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద వివాదంగా మారాయి.
- దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి శివాజీ ఉద్దేశం సరైనదే కానీ, మాట్లాడిన పద్ధతి తప్పని అన్నారు.
- ముఖ్యంగా ‘సామాన్లు’ అనే పదం వాడకూడదని దివ్వెల మాధురి అభిప్రాయపడ్డారు.
- అనసూయ, చిన్మయి వంటి పలువురు సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి శివాజీకి మద్దతుగా నిలిచారు. ఆయన ఉద్దేశం మంచిదే అయినా, మాట్లాడిన పద్ధతి సరైనది కాదని స్పష్టం చేశారు.
శివాజీ వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో దుమారం
Duvvada srinivas madhuri: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు శివాజీ(Sivaji) చేసిన వ్యాఖ్యలపై పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇటీవల కాలంలో హీరోయిన్లు వస్త్రధారణ కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి నటుడు శివాజీ దండోరా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడటమే కాకుండ కొన్ని అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిన నేపథ్యంలో ఈయన పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఈ విషయంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కొందరు శివాజీకి మద్దతుగా నిలబడగా, మరికొందరు ఆయన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి సైతం ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas)మాధురి (Madhuri) ,మాట్లాడుతూ శివాజీకి మద్దతు తెలియజేశారు. శివాజీ ఉద్దేశం కరెక్టే కానీ ఆయన మాట్లాడిన విధానం తప్పని తెలిపారు. ముఖ్యంగా సామాన్లు అనే పదం వాడుకుండ ఉండాల్సిందని దివ్వెల మాధురి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన ఇలా బహిరంగ వేదికపై కాకుండా హీరోయిన్లు చీరలు కట్టుకోమని వ్యక్తిగతంగా చెప్పి ఉంటే బాగుండేదని తెలిపారు. ఇలా హీరోయిన్లకు కాకుండా డైరెక్టర్లు నిర్మాతలకు మంచి బట్టలు ఇవ్వమని చెబితే బాగుంటుందని మాధురి శ్రీనివాస్ వారి అభిప్రాయాలను తెలిపారు.
శ్రీనివాస్-మాధురి మద్దతు: ఉద్దేశం కరెక్టే కానీ…
మన ఇంట్లో మన చెల్లి లేదా మన భార్య ఎవరైనా సరైన డ్రెస్ బాగా లేకపోతే మనం ఏ విధంగా అయితే వాళ్లకు డ్రస్ బాగాలేదు మార్చుకోమని చెబుతామో అదే ఉద్దేశంతోనే శివాజీ గారు కూడా చెప్పారు. కానీ ఆయన చెప్పిన విధానం తప్పుగా ఉంది అంటూ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. అమ్మాయిలు వేసుకునే వస్త్రధారణ కారణంగా మగాళ్లు కూడా చెడిపోతున్నారంటూ ఈ సందర్భంగా శ్రీనివాస్ మాధురి శివాజీ విషయంలో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
శివాజీ వేదికపై చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అనసూయ ఈ విషయం గురించి వరుస పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈ వివాదం పై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ అనసూయకు కౌంటర్ ఇవ్వగా మరికొందరు శివాజీ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో శివాజీ వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ వివాదానికి ఎప్పటికీ పులిస్టాప్ పడుతుందో తెలియాల్సి ఉంది.
అనసూయ, చిన్మయిల తీవ్ర విమర్శలు
మొత్తంగా శివాజీ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆయనకు మద్దతుగా, మరికొందరు విమర్శిస్తూ ఉండటంతో ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ అంశంపై మరింత మంది సినీ ప్రముఖులు స్పందించే అవకాశం ఉంది.


