
ప్రతి ఏటా వైశాఖ శుక్లపక్ష చతుర్దశి నాడు వచ్చే నరసింహ జయంతి 2024లో మే 11న జరుగుతుంది. ఈ రోజున నరసింహస్వామిని ఆరాధించి, ఉపవాసం ఉండటం వల్ల మనం సుఖశాంతులను పొందవచ్చు.
Key Points
మే 11, 2024 ఆదివారం నరసింహ జయంతి.
ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 1:39 లేదా సాయంత్రం 4:21 నుండి 7:03 వరకు పూజ.
ఉపవాసం ఉండి, నరసింహస్వామిని ఆరాధించడం శ్రేయస్కరం.
ధైర్యం, వినయం పెంపొందించుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోండి.
2024 నరసింహ జయంతి తేదీ మరియు పూజా సమయాలు
ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్దశి నాడు నరసింహ జయంతిని జరుపుకుంటాము. ఈసారి నరసింహ జయంతి ఎప్పుడు వచ్చింది?, ఈరోజు ఎటువంటి వాటిని పాటించాలి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
మే 10 శనివారం సాయంత్రం 5:29 గంటలకు చతుర్దశి తిధి మొదలవుతుంది. తర్వాత రోజు అంటే మే 11న ఆదివారం రాత్రి 8:01 తో ముగుస్తుంది. దీని ప్రకారం మే 11న ఆదివారం నాడు నరసింహ జయంతిని జరుపుకోవాలి.
మే 11న ఆదివారం ఉదయం 10:57 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. సాయంత్రం పూజ చేసుకోవాలనుకునే వారు సాయంత్రం 4:21 నుంచి 7:03 వరకు చేసుకోవచ్చు. ఈ పవిత్ర సమయంలో స్వామి వారిని ఆరాధించడం వలన ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం కలుగుతాయి.
నరసింహ జయంతి నాడు చేయాల్సినవి
విష్ణువు దశావతారాల్లో నాలుగవ అవతారం
విష్ణువు దశావతారాల్లో నాలుగో అవతారం నరసింహుని అవతారం. ప్రహ్లాదుడుని కాపాడుకోవాలని హిరణ్యకశిపుడిని వధించడానికి విష్ణువు నరసింహ అవతారాన్ని ఎత్తాడు. ఈ స్వామి ఎప్పుడూ కూడా ఉగ్రరూపంలో ఉంటాడు. భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడుకోవాలని శ్రీహరి ఈ రూపంలో అవతరించాడు.
చెడుపై మంచి గెలిచిందన్న కారణంగా నరసింహ జయంతిని జరుపుకుంటాము. ఈరోజు ఉపవాసం ఉండి, స్వామివారిని ఆరాధించడం వలన సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి.
నరసింహ జయంతి నాడు చేయకూడనివి
నరసింహ జయంతి నాడు ఏం చేస్తే మంచిది?
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
నరసింహ జయంతి నాడు ఉపవాసం, పూజలు చేయడం ద్వారా మన జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయి. భక్తితో కూడిన ఈ రోజును జరుపుకోండి.


