|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇంగ్లండ్ చేతిలో భారత్ అవమానకర ఓటమి: 76 పరుగులకే ఆలౌట్

Published: 07-07-2026, 5:47 PM
ఇంగ్లండ్ చేతిలో భారత్ అవమానకర ఓటమి: 76 పరుగులకే ఆలౌట్
  • ఇంగ్లండ్తో మూడో T20లో భారత్ 76 పరుగులకే ఆలౌట్
  • భారత బ్యాటర్లు ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేదు
  • ఇంగ్లండ్ 201 పరుగులు చేసి భారత్పై భారీ విజయం సాధించింది
  • సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో ఉంది

ఇంగ్లండ్ తో జరిగిన మూడవ T20 మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమి పాలైంది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 76 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో సిరీస్ లో ఇంగ్లండ్ 2-0 లీడ్ లో ఉంది.

ఇంగ్లండ్ బ్యాటింగ్: సాల్ట్, కరన్ షో

ఇంగ్లండ్ తో జరిగిన మూడవ T20 లో భారత్ ఘోర ఓటమి పాలైంది. 76 పరుగులకే ఆల్ ఔటయ్యి భారీ పరాజయాన్ని మూట గట్టుకుంది. టాస్ గెలిచిన టీంఇండియా బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ మొదట బ్యాటింగుకు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(70), శామ్ కరన్(40), బట్లర్(36) పరుగులతో రాణించారు. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆల్ ఔట్ కాగా.. ఏ ఒక్క బ్యాటర్ 20 రన్స్ కూడా చేయలేదు. అభిషేక్‌ శర్మ (10), వైభవ్‌ సూర్యవంశీ (13), ఇషాన్‌ కిషన్‌ (13), అక్షర్‌ పటేల్‌ (10), హర్షిత్‌ రాణా (9) శ్రేయస్‌ అయ్యర్‌ (5), వరుణ్‌ చక్రవర్తి (5), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4), తిలక్‌ వర్మ (3), శివమ్‌ దూబె (2) పరుగులు చేశారు. వచ్చినవాళ్లను వచ్చినట్టే ఇంగ్లండ్ బౌలర్లు పెవిలియన్ కు పంపారు. ఇంగ్లండ్ బౌలర్లలో టంగ్ 4, ఆర్చర్ 3, రషీద్ 2, జాక్స్ ఒక వికెట్ తీశారు. ఐదు T20 మ్యాచుల సిరీస్ లో ఇంగ్లండ్ 2-0 తో లీడ్ లో ఉంది.

భారత బ్యాటింగ్ పతనం: ఒక్కరూ రాణించలేదు

సిరీస్ స్కోరు: ఇంగ్లండ్ 2-0 లీడ్

ఇంగ్లండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి పాలైన ఈ మ్యాచ్ తో సిరీస్ లో ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్ లోని లోపాలు స్పష్టమయ్యాయి. రాబోయే మ్యాచ్ లలో భారత్ పుంజుకుంటుందేమో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.