|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. దానికంటే ముందే మేము ఆ పని చేశామంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్

Published: 25-06-2025, 2:22 AM
హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. దానికంటే ముందే మేము ఆ పని చేశామంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్

‘వినయ విధేయ రామ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇషా గుప్తా, క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తన సంబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హార్దిక్ పాండ్యాతో తనకున్న సంబంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Key Points

1

ఇషా గుప్తా మరియు హార్దిక్ పాండ్యా మధ్య డేటింగ్ రూమర్స్.

2

ఇషా గుప్తా హార్దిక్ పాండ్యాతో కొన్ని నెలలు మాట్లాడినట్లు వెల్లడించింది.

4

డేటింగ్ స్టేజ్ కి ముందే వారి బంధం తెగిపోయిందని చెప్పింది.

ఇషా గుప్తా – హార్దిక్ పాండ్యా రూమర్స్

రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘వినయ విధేయ రామ’(Vinaya Vidheya Rama) చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఇషా గుప్తా(Esha Guptha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. అలాగే స్పెషల్‌ సాంగ్స్‌లోనూ చిందులేసింది. ఇక సోషల్ మీడియా(Social Media)లో ఈ చిన్నది చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తుంది. బోల్డ్ షోతో రెచ్చ చేస్తుంది. దీంతో ఈ భామకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది.

ఇషా గుప్తా వివరణ

ఇదిలా ఉంటే.. 2018లో ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)తో ఈ అమ్మడు డేటింగ్ చేస్తోందంటూ కొన్ని రూమర్స్ నెట్టింట షికార్లు చేశాయి. అయితే తాజాగా వీటిపై స్పందించి ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘హార్దిక్ నేను కొన్ని నెలలపాటు మాట్లాడుకున్నాము. వ్యక్తిగతంగా రెండు సార్లు మీట్ అయ్యాము. దాన్ని డేటింగ్ అనలేము. కానీ డేటింగ్ స్టేజ్‌కి ముందే మా బంధం తెగిపోయింది. ప్రస్తుతం అతనితో కాంటాక్ట్‌లో లేను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నెట్టింట వైరల్ అవుతున్న కామెంట్స్

A post shared by Esha Gupta (@egupta)

చివరకు ఇషా గుప్తా తనకు, హార్దిక్ పాండ్యాకు మధ్య ఉన్న డేటింగ్ రూమర్స్ పై స్పష్టత ఇచ్చింది. వారి సంబంధం డేటింగ్ దశకు చేరక ముందే ముగిసిందని తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.