
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిలో కలిసి కనిపించిన ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్!
- ఈషా రెబ్బా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్
- గతంలో ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాలో కలిసి నటించిన ఈ జంట
- నెటిజన్లు పెట్టిన కామెంట్స్.. త్వరలో పెళ్లి పీటలెక్కేది మీరేనా అంటూ ప్రశ్నలు!
టాలీవుడ్లో మరో జంట ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ కలిసి విజయ్ దేవరకొండ పెళ్లిలో కనిపించడంతో వీరి మధ్య ఏదో నడుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ పెళ్లిలో ఈషా, తరుణ్ భాస్కర్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కుర్ర హీరోలంతా బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి ఒక్కొక్కరుగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఒక రాజభవనంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ఈ పెళ్లి వేడుకలో మరో టాలీవుడ్ జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. విజయ్-రష్మిక పెళ్లి వేడుకల్లో తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా(Isha Rebba), టాలెంటెడ్ డైరెక్టర్, హీరో తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) కలిసి కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
వీరిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే ఇటీవల వీరిద్దరూ కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతి’ అనే సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయం నుంచే వీరిద్దరి మధ్య బాండింగ్ పెరిగిందని సమాచారం. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఎన్ని పుకార్లు వస్తున్నా, ఈ జంట మాత్రం ఎక్కడా స్పందించలేదు. కానీ ఇప్పుడు విజయ్ పెళ్లిలో జంటగా కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈషా రెబ్బా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో వీరిద్దరూ చాలా ముచ్చటగా ఉండటంతో నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. విజయ్-రష్మిక పెళ్లి అయిపోయింది కాబట్టి, నెక్ట్స్ పెళ్లి పీటలు ఎక్కే జంట మీరేనా అంటూ కొందరు అడుగుతున్నారు.మరికొందరైతే తరుణ్, ఈషా పేర్లను కలిపి నెటిజన్లు ‘తరీష్’ అనే కొత్త పేరును నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ వేడుకలో వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తుంటే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ పెళ్లి వేడుక ద్వారా ఈషా-తరుణ్ భాస్కర్ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న జంట?
A post shared by Eeshaa Rebba (@yourseesha)
ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరింత సమాచారం కోసం వేచి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


