|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్‌ హీరో ఫహద్ ఫాజిల్ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్‌.. స్పెషల్‌ ఏంటి?

Published: 17-07-2025, 7:16 AM
స్టార్‌ హీరో ఫహద్ ఫాజిల్ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్‌.. స్పెషల్‌ ఏంటి?

ప్రముఖ నటులు ఎల్లప్పుడూ అత్యాధునిక వస్తువులను వాడతారని మనం అనుకుంటాం కానీ, పుష్ప సినిమా నటుడు ఫహద్ ఫాజిల్ మాత్రం 17 ఏళ్ల పాత ఫోన్‌ను వాడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

పుష్ప నటుడు ఫహద్ ఫాజిల్ 17 ఏళ్ల పాత ఫోన్‌ను వాడుతున్నారు.

2

ఆ ఫోన్ టైటానియం, నీలమణి స్ఫటికాలతో తయారైంది.

4

ఫహద్ సింపులిసిటీకి, పాత వస్తువుల పట్ల ప్రేమకు ఇది నిదర్శనమని అభిమానులు అంటున్నారు.

ఫహద్ ఫాజిల్‌ యొక్క అరుదైన ఫోన్

సినీ తారలు ధరించే దుస్తులు మొదలు .. వాళ్లు వాడే వస్తువుల వరకు .. ప్రతిదీ చాలా ఖరీదైనవి ఉంటాయి . ట్రెండ్ ‌ కు తగ్గట్లుగా వాళ్ల వస్తువులు మారుతుంటాయి . ముఖ్యంగా వాహనాలు , మొబైల్ ‌ ఫోన్ల విషయంలో స్టార్స్ ‌ ఎప్పటికప్పుడు అప్ ‌ డేట్ ‌ వెర్షన్ ‌ మోడల్ ‌ ని తీసుకుంటారు . కానీ ఓ స్టార్ ‌ హీరో మాత్రం ఇప్పటికీ 17 ఏళ్ల క్రితం కొన్న ఫోన్ ‌ నే వాడుతున్నాడు . అత్యాధునిక టెక్నాలజీ ఉన్న స్మార్ట్ ‌ ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ .. కీప్యాడ్ ‌ ఫోన్ ‌ నే ఉపయోగిస్తున్నాడు. ఆ స్టార్ ‌ ఎవరో కాదు పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు ఫహద్ ‌ ఫాజిల్ ‌. ఆయన వాడుతున్న ఫోన్ ‌ పై ఇప్పుడు సోషల్ ‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది .

ఇటీవల మలయాళ దర్శకుడు అభినవ్ ‌ సుందర్ ‌ సినిమా ఓపెనింగ్ ‌ ఈవెంట్ ‌ లో ఫహద్ ‌ పాల్గొన్నాడు . ఆయన ఫోన్ ‌ మాట్లాడుతుండగా ఆ విజువల్స్ ‌ ని అక్కడి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించారు . వాటిని సోషల్ ‌ మీడియాలో షేర్ ‌ చేయగా .. అందరూ ఆయన వాడుతున్న ఫోన్ ‌ గురించే చర్చించడం మొదలు పెట్టాడు . స్మార్ట్ ‌ ఫోన్ ‌ కాదని ఈ ఫోన్ ‌ ఎందుకు వాడుతున్నాడా ? అని ఆరా తీస్తున్నారు .

ఫోన్ యొక్క ప్రత్యేకతలు

ఇక ఆ ఫోన్ ‌ విషయానికొస్తే .. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మార్కెట్ ‌ లోకి వచ్చింది . అప్పట్లో దాని ధర రూ . 5-54 లక్షల వరకు ఉండేదట . ఇది ఒక అల్ట్రా-లగ్జరీ నాన్-స్మార్ట్‌ఫోన్ . 2007 లో అనౌన్స్ ‌ చేసి .. 2008 లో ఆ ఫోన్ ‌ ని మార్కెట్ ‌ లోకి తీసుకొచ్చారు . ఆ ఫోన్ ‌ టైటానియంతో తయారు చేశారట . నీలమణి స్పటికలతో పాటు చేతితో కుట్టిన లెదర్ ‌ తో పైభాగం కప్పబడి ఉంటుంది . ప్రస్తుతం ఈ ఫోటో మార్కెట్‌లో లేదు కానీ ప్రీ-ఓన్డ్ వెబ్‌సైట్‌లలో రూ.1 – 1.5 లక్షలకు దొరుకుతుంది. ఈ ఫోన్‌లో స్మార్ట్‌ఫోన్ లాంటి ఆధునిక ఫీచర్లు లేనప్పటికీ దాని బ్రాండ్ విలువ , అరుదైన డిజైన్ ‌ కారణంగా ఆ ఫోన్ ‌ వార్తల్లో నిలుస్తోంది .

ఫహద్ లాంటి స్టార్ నటుడు ఇంత పాత ఫోన్‌ను ఉపయోగించడం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఆయన సింప్లిసిటీకి ఇది నిదర్శనం అంటుంటే .. మరికొందరు పాత వస్తువుల పట్ల ప్రేమను చూపిస్తున్నాడంటూ కామెంట్ ‌ చేస్తున్నారు .

అభిమానుల ప్రతిచర్యలు

సినిమాల విషయానికొస్తే .. కుంభసారం’, ‘తొండిముతలం ద్రిక్సాక్షియం’, ‘మాలిక్’ వంటి చిత్రాలతో అతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పోలీసు అధికారి షేకావత్‌ పాత్రలో ఫహద్‌ అద్భుతంగా నటించాడు. ఆయన తాజా చిత్రం మారేసన్ మూవీ జులై 25న విడదల కాబోతుంది.

ఫహద్ ఫాజిల్ యొక్క సరళతకు, పాత వస్తువుల పట్ల అభిమానానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ఆయన సినిమా ప్రయాణం కంటే ఆయన జీవనశైలి చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.