
📌 Key Points
- 70% ప్రోటీన్ పౌడర్లు నకిలీవని డాక్టర్ పూజారెడ్డి హెచ్చరించారు.
- కొన్ని సప్లిమెంట్లలో సీసం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకర లోహాలు ఉన్నాయని గుర్తించారు.
- ప్రోటీన్ పౌడర్లలో చక్కెర లేదా తక్కువ నాణ్యత కలిగిన పిండి పదార్థాలు కలుపుతున్నారని వైద్యులు తెలిపారు.
- సప్లిమెంట్లు వాడే ముందు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.
ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పూజారెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే 70 శాతం ప్రోటీన్ పౌడర్లు నకిలీవని ఆమె హెచ్చరించారు.
ప్రోటీన్ పౌడర్లలోని నకిలీలు
Fake Protein Powders : నేటి కాలంలో కండలు పెంచాలన్నా… ఫిట్‌గా ఉండాలన్నా చాలామంది వెంటనే ఆశ్రయించేది ప్రోటీన్ సప్లిమెంట్లను. అయితే మనం ఎంతో నమ్మకంతో కొనే ఈ ప్రోటీన్ డబ్బాల్లో అసలు ఏముంది…? అవి మన ఆరోగ్యాన్ని పెంచుతున్నాయా లేక లోలోపల మన అవయవాలను చిధ్రం చేస్తున్నాయా..? అనే అంశాలపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు పూజారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు.
మన దేశంలో విక్రయిస్తున్న 70 శాతం ప్రోటీన్ పౌడర్లు నకిలీవని… అవి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా హెచ్చరించారు. మన దేశంలోని 36 ప్రముఖ ప్రోటీన్ సప్లిమెంట్లను పరీక్షించిన ఒక అధ్యయనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
“మనం తీసుకునే ప్రోటీన్ పౌడర్లలో 70 శాతం తప్పుగా లేబుల్ చేశారు. అంటే డబ్బాపై ఉన్న వివరాలకు, లోపల ఉన్న పొడికి అస్సలు సంబంధం లేదు” అని ఆమె వివరించారు. కేవలం పోషక విలువలు తక్కువగా ఉండటమే కాదు, వీటిలో భయంకరమైన టాక్సిన్స్ (విష పదార్థాలు) ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రమాదకర లోహాలు, విష పదార్థాలు
అధ్యయనంలోని వివరాలను ప్రస్తావిస్తూ… “14 శాతం సప్లిమెంట్లలో సీసం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు ఉన్నాయి. కొన్నింటిలో ఫంగల్ టాక్సిన్స్ (శిలీంధ్రాల విషం), పురుగుమందుల అవశేషాలు బయటపడ్డాయి. ప్రోటీన్ అని చెప్పి చక్కెర లేదా తక్కువ నాణ్యత కలిగిన పిండి పదార్థాలను నింపేస్తున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
A post shared by Dr. Pooja Reddy (@dr.poojareddy)
సప్లిమెంట్లు తీసుకోవడంలో యూత్ చేస్తున్న అతిపెద్ద తప్పులను డాక్టర్ పూజారెడ్డి ప్రత్యేకంగ ప్రస్తావించారు. మన శరీరం ఒక కాలిక్యులేటర్ కాదని…. అదొక సున్నితమైన వ్యవస్థ అని ఆమె గుర్తు చేశారు. సగటు ఫిట్‌నెస్ ప్రేమికులు చేసే మూడు ప్రధాన పొరపాట్లను ఎత్తిచూపారు.
వైద్యుల సూచనలు, జాగ్రత్తలు
ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. “మీకు డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు (BP) ఉంటే, ఏవైనా సప్లిమెంట్లు వాడే ముందు తప్పనిసరిగా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT) చేయించుకోండి,” అని డాక్టర్ డాక్టర్ పూజారెడ్డి సూచించారు.
కనీసం 3 లీటర్ల నీరు తాగడం… ప్రతి భోజనంతో ఫైబర్ తీసుకోవడం వంటి అలవాట్లను అలవర్చుకోవాలని ఆమె కోరారు. సప్లిమెంట్లు శక్తివంతమైనవే.. కానీ మీ శరీరం వాటిని గ్రహించే స్థితిలో ఉంటేనే అవి పనిచేస్తాయని ఆమె స్పష్టం చేశారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ప్రోటీన్ సప్లిమెంట్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటి వినియోగంపై మరింత అవగాహన పెంచుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.


