
📌 Key Points
- ఫాతిమా సనా షేక్ భారీ కొండపైనుంచి నీటిలోకి దూకి డేరింగ్ స్టంట్ చేసింది.
- జంప్ చేయడానికి ముందు 20 నిమిషాల పాటు టెన్షన్ పడ్డట్టు ఆమె తెలిపింది.
- గాలిలో ఉన్నప్పుడు, నీటిని ఢీకొనే ముందు విచిత్రమైన అనుభూతికి లోనయ్యానని చెప్పింది.
- ఈ సాహసోపేతమైన వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది.
దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తాజాగా చేసిన ఓ సాహసం నెట్టింట వైరల్‌గా మారింది. భారీ కొండపైనుంచి నీటిలోకి దూకి అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ డేరింగ్ స్టంట్ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సాహసం
‘దంగల్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaikh). ఇందులో ఆమిర్ ఖాన్ కూతురిగా నటించిన ఆమె రీల్ తండ్రితో రొమాన్స్ కూడా చేసింది. వరుప సినిమాలు చేస్తున్నప్పటికీ అమ్మడుకి అనుకున్నంత స్థాయిలో ఫేమ్ రావడం లేదు. అయినప్పటికీ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ఫాతిమా మెట్రో ఇన్ దినో(Metro in Dino), ఆప్ జైసా కోయి వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు హిట్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది.
జంప్‌కి ముందు ఆ 20 నిమిషాలు!
ఇందులో స్విమ్ సూట్ ధరించి హాట్ లుక్స్‌లో ఓ పెద్ద కొండపైనుంచి నీటిలోకి దూకేసింది. అది చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు. సాధారణంగానే అలాంటి ప్రాంతాల్లో స్విమ్మింగ్ చేయడం కష్టం . అలాంటిది అంత ఎత్తునుంచి దూకడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ పోస్ట్‌కు ఫాతిమా.. ‘‘ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాను. కానీ జంప్ చేయాలని బలంగా నిర్ణయించుకున్న కారణంగా ఇలా చేయగలిగాను. ఆ గట్టు మీద నిలబడి దూకడానికి నాకు 20 నిమిషాలు పట్టింది. ధైర్యం తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాను. చాలా మదన పడ్డ తర్వాత జంప్ చేశాను.
నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
గాలిలో ఉన్నప్పుడు, నీటిని ఢి కొనే ముందు క్షణం వరకు చాలా పొడవుగా అనిపిస్తుంది. ఆ సయంలో నేను చాలా విచిత్రమైన అనుభూతికి గురయ్యాను. జంప్‌కి ముందు నాకు ఉన్న ఆలోచనలు అన్నీ కూడా జంప్ తర్వాత పోయాయి. నేను గొప్ప పని చేసిన సంతోషం ఉంది’’ అని రాసుకొచ్చింది. సాధారణంగా హీరోయిన్స్ స్విమ్మింగ్ ఫూల్‌లో జంప్ చేసేందుకే భయపడతారు. అలాంటిది ఫాతిమా ఏకంగా అంత పెద్ద కొండ మీద నుంచి జంప్ చేయడం చూసిన వారంతా ఆమెను ప్రశంసిస్తున్నారు. మొత్తానికి ఫాతిమా వీడియో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
హీరోయిన్స్ సాహసాలకు దూరంగా ఉంటారు. కానీ ఫాతిమా సనా షేక్ ధైర్యంగా చేసిన ఈ జంప్ అందరినీ ఆకట్టుకుంది. ఆమె సాహస స్ఫూర్తికి నెటిజన్ల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


