|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తొలి తెలుగు సినీ నేపథ్యగాయని రావు బాలసరస్వతి దేవి ఇక లేరు

Published: 15-10-2025, 4:23 AM

తెలుగు సినీ సంగీత లోకంలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ తొలి నేపథ్య గాయనుల్లో ఒకరైన రావు బాలసరస్వతీ దేవి 97 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె మృతితో సంగీత ప్రియులు, సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆమె సినీ ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శప్రాయం.

Key Points

1

టాలీవుడ్ తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి కన్నుమూత.

2

97 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన బాలసరస్వతి.

4

ఆమె గాత్రం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల వంటివారికి స్ఫూర్తి.

రావు బాలసరస్వతి దేవి: బాల్యం, సంగీత శిక్షణ

తెలుగు సినీ సంగీత రంగంలో తీవ్ర విషాదం. టాలీవుడ్ తొలి నేపథ్య గాయనుల్లో ఒకరైన రావు బాలసరస్వతీ దేవి కన్నుమూశారు. 97 ఏళ్ల వయస్సులో పలు అనారోగ్య కారణాల వల్ల ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో స్వగృహంలో ఆమె మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. రావు బాలసరస్వతీ మృతి వార్తతో సంగీత ప్రియులు, సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

1928, ఆగస్టు 29న మద్రాసులో పార్థసారథి, విశాలాక్షి దంపతులకు జన్మించిన బాలసరస్వతి, సంగీతం పట్ల చిన్నతనం నుంచే ఆకర్షణ కలిగి ఉండేవారు. వారి తాత మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. కుటుంబ ఆస్తులు ఉన్నప్పటికీ బాలసరస్వతి ఎక్కువగా చదువుకోలేదు. ఆమె విద్యపై ఆసక్తి చూపలేదు. వారి తాతగారు మినహాయించి 1934లో కుటుంబం అంతా గుంటూరుకు తరలివచ్చింది. వారి గుటుంబానికి చెందిన రత్న మహల్ సినిమా థియేటర్ ను చూసుకుంటూ పలు వ్యాపారాలు కూడా వీరి ఫ్యామిలీ చేసింది.

సినీ రంగ ప్రవేశం, బహుభాషా గాయనిగా

చిన్నతనం నుంచే సంగీతం అంటే ఎంతో ఇష్టంతో బాలసరస్వతీ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అలత్తూర్ సుబ్బయ్య వద్ద మూడు సంవత్సరాలు నేర్చుకున్నారు. అనంతరం ఖేల్కర్, వసంత దేశాయ్ వద్ద హిందుస్తానీ సంగీతాన్ని అభ్యసించారు. కె. పిచ్చుమణి వద్ద వీణా, డానియల్ వద్ద పియానో శిక్షణ తీసుకున్నారు. ఆరేళ్ల వయసులోనే హెచ్.ఎం.వి. (HMV) ద్వారా “నమస్తే నా ప్రాణనాథ”, “ఆకలి సహింపగజాల”, “పరమపురుష పరంధామ” లాంటి పాటలతో సోలో రికార్డులు విడుదల చేశారు.

సినీ సంగీతానికి ఆమె సేవలు, వారసత్వం

ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, అనేక భాషల్లో పాటలు పాడారు. ‘సతీ అనసూయ’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి తొలి నేపథ్య గానం చేశారు. అనంతరం తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పాటలతో ఆమె పేరు సంపాదించారు. మొత్తం 2000కి పైగా పాటలు ఆమె ఆలపించారు.రావు బాలసరస్వతి గారు తెలుగు సినీ సంగీతానికి బాటలు వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వారి గాత్రం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి లాంటి దిగ్గజ గాయకులు ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు.

రావు బాలసరస్వతి దేవి మృతి తెలుగు సినీ సంగీత రంగానికి తీరని లోటు. ఆమె తన గాత్రంతో ఎందరో దిగ్గజ గాయకులకు స్ఫూర్తినిచ్చారు. ఆమె వారసత్వం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది, ఆమె జ్ఞాపకాలు మన హృదయాల్లో సజీవంగా ఉంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.