|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విషమంగా ఫిష్ వెంకట్ ఆరోగ్యం..మూడు రోజుల నుంచి కళ్ళు కూడా తెరవలేదా !

Published: 12-07-2025, 10:24 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉంది. రెండు కిడ్నీలు, లివర్ డ్యామేజ్ అయ్యి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజులుగా కళ్ళు తెరవడం లేదని వార్తలు వస్తున్నాయి.

ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి

చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ కమెడియన్, విలన్ పాత్రలో అదరగొట్టిన ఫిష్ వెంకట్ (Fish Venkat).. ప్రస్తుతం చావు బతుకుల్లో ఉన్నాడు. చావుతో పోరాటం చేస్తున్న ఫిష్ వెంకట్ ను ఆదుకునేందుకు తలో సహాయం చేస్తున్నారు. రెండు కిడ్నీలు, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిందని తెలుస్తోంది. దీంతో ఆయనను హైదరాబాద్ ఉప్పల్ లోని ( Uppal) ప్రముఖ ఆసుపత్రిలో… చేర్పించారు కుటుంబ సభ్యులు.

ఆసుపత్రిలో చికిత్స

దాదాపు 20 రోజుల నుంచి ఆసుపత్రిలోనే వెంటిలేటర్ పై (Ventilater) ఫిష్ వెంకట్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దాదాపు 50 లక్షల వరకు ఫిష్ వెంకట్ కు ఖర్చు అవుతుందట. దీంతో కుటుంబ సభ్యులు కూడా… తమకు ఎవరైనా సహాయం చేయాలని వేడుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఫిష్ వెంకట్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని అంటున్నారు.

కుటుంబం ఆర్థిక సహాయం కోరుతోంది

రెండు కిడ్నీలతో పాటు లివర్ డ్యామేజ్ కావడం… ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందట. దీంతో మూడు రోజులుగా ఫిష్ వెంకట్ కళ్ళు తెరవడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఆయన బతకడం కూడా కష్టమే అని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… ఇండస్ట్రీలో ఈ వార్త ప్రచారం జోరుగా సాగుతోంది.

ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇండస్ట్రీ వర్గాలు ఆయనకు తోడ్పాటు అందిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.