
ఫ్లిప్కార్ట్ జూలై 2026 డీల్లో AI ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ఫోన్ భారీ డిస్కౌంట్తో లభిస్తోంది. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ కేవలం రూ. 18,999 ధరలో అందుబాటులో ఉంది.
Key Points
ఫ్లిప్కార్ట్ జూలై 2026 డీల్లో AI ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ఫోన్ రూ. 18,999కు లిస్ట్ అయింది.
బ్యాంక్ ఆఫర్లతో రూ. 1,900 తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్తో రూ. 13,950 వరకు ఆదా చేయొచ్చు.
ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 6,000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉన్నాయి.
144Hz రిఫ్రెష్ రేట్, 1.5K అమోల్డ్ డిస్ప్లే, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
AI ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ధర, ఆఫర్లు
Flipkart July 2026 Deal : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు ఏఐ ఫ్లస్ కొత్త ఫోన్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌లతో పొందవచ్చు.
ఏఐ నోవా 2 అల్ట్రా 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 6,000mAh బ్యాటరీ (Flipkart July 2026 Deal) ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఆఫర్‌లు, డిస్కౌంట్లు, ధరలపై ఓసారి లుక్కేయండి..
ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ధర, ఆఫర్లు : ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18,999 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ. 1,900 తగ్గింపు లభిస్తుంది. అసలు ధర రూ. 17,099 అవుతుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 13,950 వరకు ఆదా చేయొచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ చేసే ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
AI ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
Read Also : Motorola Edge 70 Max : మోటోరోలా మజాకా.. ఈ నెల 15న కొత్త మోటో 70Max వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..
ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2,500 నిట్స్ టాప్ బ్రైట్ నెస్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
8జీబీ LPDDR4x ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత NxtQ OSపై రన్ అవుతుంది. ఈ ఫోన్ 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.
ఫ్లిప్కార్ట్ డీల్: ఎలా పొందాలి?
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఏఐ ఫ్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది.
ఫ్లిప్కార్ట్ జూలై 2026 డీల్లో AI ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో చాలా చౌకగా లభిస్తోంది. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్ను బెస్ట్ బైగా మారుస్తున్నాయి. డీల్ మిస్ అవ్వకండి!


