|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫ్రెంచ్ కిస్ ఇవ్వలేని సంస్కృతం టీచర్.. 39 ఏళ్ల వయసులో పెళ్లి కోసం తంటాలు.. నేరుగా ఓటీటీలోకి మాధవన్ రొమాంటిక్ కామెడీ మూవీ

Published: 25-06-2025, 5:52 AM
ఫ్రెంచ్ కిస్ ఇవ్వలేని సంస్కృతం టీచర్.. 39 ఏళ్ల వయసులో పెళ్లి కోసం తంటాలు.. నేరుగా ఓటీటీలోకి మాధవన్ రొమాంటిక్ కామెడీ మూవీ

మాధవన్ మరియు ఫాతిమా సనా షేక్ నటించిన ‘ఆప్ జైసా కోయి’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా ట్రైలర్ విడుదలైంది. 39 ఏళ్ల సంస్కృత ఉపాధ్యాయుని పెళ్ళి ప్రయత్నాల చుట్టూ తిరిగే ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.

Key Points

1

మాధవన్, ఫాతిమా సనా షేక్ జంటగా నటించిన 'ఆప్ జైసా కోయి' ట్రైలర్ విడుదల

2

39 ఏళ్ల సంస్కృత ఉపాధ్యాయుడి పెళ్ళి కథానాయకం

4

జులై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

మాధవన్, ఫాతిమా సనా షేక్ జంటగా

నెట్‌ఫ్లిక్స్ లోకి ఇప్పుడో రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది. మాధవన్, దంగల్ మూవీ ఫేమ్ ఫాతిమా సనా షేక్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ బుధవారం (జూన్ 25) రిలీజైంది. ఈ మూవీ పేరు ఆప్ జైసా కోయి (Aap Jaisa Koi). సరదాగా సాగిపోయిన ఈ ట్రైలర్లో మాధవన్ ఓ సంస్కృతం టీచర్ గా నటించడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ గతంలోనే ఆప్ జైసా కోయి మూవీని అనౌన్స్ చేసింది. జులై 11 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది. ఓ సంస్కృతం టీచర్ గా పని చేసే శ్రీరేను ( మాధవన్ ) అనే 39 ఏళ్ల వ్యక్తి.. పెళ్లి కోసం తంటాలు పడుతుంటాడు. ఓ మధ్యవర్తి ద్వారా 32 ఏళ్ల మధు అనే మరో టీచర్ ను అతడు కలుసుకుంటాడు.

సంస్కృత ఉపాధ్యాయుడి ప్రేమకథ

అయితే సాంప్రదాయ కుటుంబానికి చెందిన శ్రీరేను, మోడర్న్ అమ్మాయి అయిన మధుకి అంత సులువుగా లింకు కలవదు. ఆమెతోపాటు ఆమె కుటుంబం కూడా చాలా ఆధునికంగా కనిపిస్తుంది. కానీ శ్రీరేను కుటుంబం మాత్రం సంస్కృతి, సాంప్రదాయాలంటూ ఆ అమ్మాయిని అంగీకరించరు. ఈ నేపథ్యంలో వీళ్ల పెళ్లి జరుగుతుందా లేదా అన్నది మూవీలో చూడాలి.

మాధవన్, ఫాతిమా సనా షేక్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ ఆప్ జైసా కోయి మూవీ ట్రైలర్ చాలా సరదాగా సాగిపోయింది. సంస్కృతం టీచర్ కు ఫ్రెంచ్ కిస్ ఎలా తెలుస్తుందిలే అంటూ ఓ ఫ్రెండ్ మాధవన్ ను ఆటపట్టించే డైలాగు కూడా ఈ ట్రైలర్లో చూడొచ్చు.

నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల

అటు సాంప్రదాయ కుటుంబం, ఇటు పెళ్లి చూపులతోనే ప్రేమలో పడిపోయిన అమ్మాయి మధ్య తంటాలు పడే వ్యక్తి పాత్రలో మాధవన్ నటించాడు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం చాలా సరదాగా సాగిపోయేలా కనిపిస్తోంది. సాంప్రదాయాలకు, ఆధునికతకు మధ్య ఎప్పుడూ ఉండే సంఘర్షణను ఈ సినిమాలో మేకర్స్ చూపించబోతున్నారు.

వివేక్ సోనీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. కరణ్ జోహార్ తోపాటు అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సినిమాకు నిర్మాతలుగా ఉన్నారు. కథను రాధికా ఆనంద్ అందించింది. ఈ ఆప్ జైసా కోయి మూవీ జులై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదే ఓటీటీలో మాధవన్ నటించిన టెస్ట్ మూవీ కూడా ఈ మధ్యే స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే.

మొత్తం మీద, ‘ఆప్ జైసా కోయి’ సినిమా ట్రైలర్ ఆకర్షణీయంగా ఉంది. సాంప్రదాయాలు, ఆధునికత మధ్య సంఘర్షణతో కూడిన ఈ రొమాంటిక్ కామెడీ జులై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.