గబ్బర్ సింగ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తాజా అప్డేట్ ఇదే!
Key Points
గబ్బర్ సింగ్ ఫేమ్ రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్, హైదరాబాద్ అపోలోలో చికిత్స
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన, త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ తో రమేష్‌కు మంచి గుర్తింపు
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ తో కలిసి స్టెప్పులేసిన రమేష్
గబ్బర్ సింగ్ ఫేమ్ రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్
‘గబ్బర్ సింగ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం రమేష్ ఐసీయూలో ఉన్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే రమేష్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ మూవీతో నటుడు రమేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా అతనికి ఎన్నో అవకాశాలు తెచ్చిపెట్టింది. విలన్ గా, కామెడీ విలన్ గా రమేష్ అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ‘కాలరే ఎత్తరా’ అనే పాటలో పవన్ తో కలిసి రమేష్ స్టెప్పులేశారు. రమేష్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలియడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
అపోలో హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స
పవన్ కళ్యాణ్ అభిమానుల ఆందోళన
రమేష్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం వెయిట్ చేయండి.


