|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Teaser : ఆ హనుమాన్ సపోర్ట్‌తోనే ఈ సినిమా ఇంతటి స్థాయిలో తెరకెక్కింది.. హీరో వైరల్ కామెంట్స్

Published: 11-07-2025, 12:13 PM

‘గదాధారి హనుమాన్’ అనే భారీ బడ్జెట్ మైథలాజికల్ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా హీరో రవి కిరణ్ మాట్లాడుతూ, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ ఆశీస్సులతోనే ఈ సినిమా ఇంతటి స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు.

Key Points

1

‘గదాధారి హనుమాన్’ సినిమా టీజర్ లాంచ్ వేడుక జరిగింది.

2

హీరో రవికిరణ్, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

4

సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని హీరో తెలిపారు.

‘గదాధారి హనుమాన్’ టీజర్ లాంచ్

మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘గదాధారి హనుమాన్’. విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవి కిరణ్ హీరోగా నటిస్తుండగా.. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో

ఈ సందర్భంగా హీరో రవి కిరణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన మా నిర్మాతలు బసవరాజ్, రేణుకా ప్రసాద్‌లకు థాంక్స్. మొదట్లో ఈ సినిమాను చాలా చిన్నగా చేయాలని అనుకున్నాం. కానీ ఆ హనుమాన్ ఇచ్చిన సపోర్ట్, శక్తి వల్లే ఈ సినిమాను ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగాం. క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మా చిత్రంలో మ్యూజిక్, బీజీఎం, విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయనకు హనుమాన్ అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఆశీస్సులు మా సినిమాపై ఉంటాయని భావిస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. తారకాసుర చిత్రానికి కన్నడ, తెలుగులో మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాను అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే ఈ మూవీని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

హీరో రవి కిరణ్ వ్యాఖ్యలు

సినిమా విశేషాలు

‘గదాధారి హనుమాన్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని హీరో ఆశాభావం వ్యక్తం చేశారు. క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.