|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్ అవార్డులు: ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్

Published: 29-05-2025, 3:57 AM
గద్దర్ అవార్డులు: ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్

14 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో గద్దర్ అవార్డుల వేడుక జరిగింది. జయసుధ, దిల్ రాజు, జీవిత వంటి ప్రముఖులు అవార్డులను ప్రకటించారు. ప్రభాస్ నటించిన కల్కి ఉత్తమ చిత్రంగా నిలిచింది.

Key Points

1

ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కల్కి ఎంపిక

2

ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప 2)

4

వివిధ విభాగాలలో అనేక చిత్రాలు, నటీనటులు అవార్డులు గెలుచుకున్నాయి

గద్దర్ అవార్డుల విజేతలు

14 ఏళ్ళ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ అవార్డుల సంబరం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే తెలుగు చిత్ర పరిశ్రమకి గద్దర్ అవార్డులు ఇస్తామని తెలిపారు. విధి విధానాలు రూపొందించి జ్యూరీ సభ్యురాలిగా జయసుధని నియమించారు. కొద్దిసేపటి క్రితమే జయసుధ.. దిల్ రాజు, జీవిత రాజశేఖర్ లాంటి ప్రముఖులతో కలసి గద్దర్ అవార్డులని ప్రకటించారు. గద్దర్ అవార్డుల్లో ప్రభాస్ కల్కి చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ అవార్డులు గెలుచుకున్నారు. గద్దర్ అవార్డుల కంప్లీట్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

మొదటి ఉత్తమ చిత్రం – కల్కి 2898 ఎడి

రెండవ ఉత్తమ చిత్రం – పొట్టేల్

మూడవ ఉత్తమ చిత్రం – లక్కీ భాస్కర్

ఫీచర్ ఫిలిం జాతీయ సమైక్యత, సోషల్ విభాగం – కమిటీ కుర్రోళ్ళు

బెస్ట్ చిల్డ్రన్ మూవీ – 35 చిన్న కథ కాదు

బెస్ట్ హెరిటేజ్, హిస్టరీ చిత్రం – రజాకార్

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు )

డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆయ్

ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ (కల్కి )

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2)

ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథ కాదు )

ఉత్తమ చిత్రం, నటుడు, నటి

ఉత్తమ సహాయ నటుడు -ఎస్ జె సూర్య (సరిపోదా శనివారం )

ఉత్తమ సహాయ నటి – శరణ్య ప్రదీప్ (అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ )

ఉత్తమ సంగీత దర్శకుడు – భీమ్స్ (రజాకార్ )

బెస్ట్ మేల్ సింగర్ – సిద్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన )

బెస్ట్ ఫిమేల్ సింగర్ – శ్రేయ ఘోషల్ (పుష్ప 2)

బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా 2)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్)

ఉత్తమ కథా రచయిత – శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)

బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్ )

బెస్ట్ లిరిసిస్ట్ – చంద్రబోస్ ( రాజు యాదవ్ )

బెస్ట్ సినిమాటోగ్రఫీ – విశ్వనాథ్ రెడ్డి (గామి)

బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి ( లక్కీ భాస్కర్ )

ఇతర ముఖ్య అవార్డులు

బెస్ట్ ఆడియో గ్రాఫర్ – అరవింద్ మీనన్ ( గామి)

బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య ( దేవర)

బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – నితిన్ జిహాని చౌదరి (కల్కి)

బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్ రాథోడ్ ( గ్యాంగ్ స్టర్)

బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శ్రీను (రజాకార్)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)

స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ :

1.దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)

2. అనన్య నాగళ్ళ (పొట్టేల్)

3. స్పెషల్ జ్యూరీ డైరెక్టర్స్ – సందీప్, సుజీత్ (క మూవీ)

4. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి (రాజు యాదవ్)

5. ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2).

గద్దర్ అవార్డులతో తెలుగు సినిమా పరిశ్రమకు ఒక కొత్త శకం ప్రారంభమైంది. విజేతలందరికీ అభినందనలు!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.