|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్ ఫిలిం అవార్డ్స్ సంచలనం! ఎవరెవరికి ఎంత పారితోషికం? ఊహించని నిజాలు!

Published: 21-03-2026, 10:35 AM
గద్దర్ ఫిలిం అవార్డ్స్ సంచలనం! ఎవరెవరికి ఎంత పారితోషికం? ఊహించని నిజాలు!
  • గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుకలో నటీనటుల ప్రతిభకు గుర్తింపు లభించింది.
  • సుమ కనకాల హోస్ట్‌గా రూ. 6.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.
  • శ్రేయ ఘోషల్ తన గానానికి రూ. 1.65 లక్షలు పారితోషికం తీసుకున్నారు.
  • దేవిశ్రీప్రసాద్ మరియు అతని టెక్నీషియన్స్‌కు భారీగా పారితోషికం చెల్లించారు.

గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుకలో నటీనటులకు, సింగర్లకు భారీగా పారితోషికాలు చెల్లించారు. సుమ కనకాల, శ్రేయ ఘోషల్ వంటి ప్రముఖులు అందుకున్న రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 విశేషాలు

Gaddar Film 2025 Awards: సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటీనటులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల అవార్డులను ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమకు నంది అవార్డులను ప్రకటించారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటివరకు నటీనటులకు నంది అవార్డులను ప్రకటించలేదు అయితే గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం నంది అవార్డుల పేర్లను మారుస్తూ గద్దర్ అవార్డులతో ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు.

గత ఏడాది కూడా ఈ అవార్డు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉగాది పండుగ రోజున ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా 2025 వ సంవత్సరంలో విడుదలైన సినిమాలలో వివిధ భాగాలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు. పెద్ద ఎత్తున వారి పర్ఫామెన్స్ తో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే గద్దర్ ఫిలిం అవార్డ్స్ (Gaddar Film Awards) కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి యాంకర్లుగా కొనసాగిన వారికి అలాగే సింగర్ గా కొనసాగిన వారికి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్లు ఇచ్చారని తెలుస్తోంది.

రెమ్యూనరేషన్ వివరాలు: ఎవరికి ఎంత?

సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమాని హోస్ట్ గా వ్యవహరించిన సుమ కనకాల (Suma Kanakala)ఏకంగా ఆరు లక్షల 50 వేల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. అలాగే కో యాకర్ ప్రదీప్ కూడా ఇదే స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సింగర్స్ శ్రేయ ఘోషల్ (Shreya Goshal)తన అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈమె పర్ఫామెన్స్ కు గాను ఏకంగా ఒక 1. 65 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నటి నిధి అగర్వాల్ పర్ఫార్మెన్స్ కి గాను 20 లక్షలు రూపాయలు దేవిశ్రీప్రసాద్ 60 లక్షలు,అతని టెక్నీషియన్స్‌కి 20 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

https://twitter.com/matsyaraju_/status/2035280280114901058/photo/1

నెటిజన్ల స్పందనలు, ఆశ్చర్యకరమైన విషయాలు

ఇలా గద్దర్ అవార్డు కార్యక్రమంలో భాగంగా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్లు ఇచ్చారు అనే విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గద్దర్ అవార్డులను ప్రకటిస్తూ తెలుగు నటినటులను గౌరవిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది గద్దర్ ఫిలిం అవార్డులతో పాటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పురస్కారాలను కూడా అందజేశారు. దాదాపు 17 విభాగాలలో ఈ గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించారు.

గద్దర్ అవార్డుల వేడుకలో భారీ పారితోషికాలు చెల్లించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అవార్డులు తెలుగు సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.