|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘గేమ్ ఛేంజర్’తో జీవితాలు అయిపోయాయి అనుకున్నాం.. దుమారం రేపుతున్న నిర్మాత కామెంట్స్

Published: 01-07-2025, 7:48 AM

రామ్ చరణ్ నటించిన ‘గేం ఛేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని, హీరో, దర్శకుడు ఎలాంటి సహాయం చేయలేదని నిర్మాత శిరీష్ తెలిపారు.

Key Points

1

‘గేమ్ ఛేంజర్’ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

2

నిర్మాత శిరీష్, రామ్ చరణ్, దర్శకుడు సహాయం చేయలేదని ఆరోపించారు.

3

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాన్ని రేపుతున్నాయి.

4

మెగా అభిమానులు నిర్మాతపై తీవ్రంగా విమర్శిస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్: నిర్మాతల ఆవేదన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు(dilraaju), శిరీష్ రూ. 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. అంతేకాకుండా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత శిరీష్ ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అవడంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘రామ్ చరణ్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం.

హీరో, దర్శకునిపై నిర్మాత ఆరోపణలు

కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో మళ్లీ నిలబడుతామన్న నమ్మకం వచ్చిది. కేవలం 4 రోజుల్లోనే మా పరిస్థితి మారిపోయింది. అప్పుడు ఎలా ఉండేదో ఊహించుకోలేం. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఏమైపోయేదో అర్ధం కాలేదు. అందరూ మా పని అయిపోయిందని హేళన చేశారు. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అయితే హీరో వచ్చి మాకు ఏమైనా సాయం చేశాడా? డైరెక్టర్ వచ్చి ఏమైనా చేశాడా అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ చేసి మా పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు రామ్ చరణ్ కూడా అడగలేదు.

సోషల్ మీడియాలో వివాదం

మీరెలా ఉన్నారు.. అని కూడా మమ్మల్ని అడిగివారు లేరు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు. అలాగే ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. సినిమా మాకు ఇష్టం ఉండటం వల్ల తీసుకున్నాం డబ్బులు పోగొట్టుకున్నాం. రెమ్యునరేషన్‌లో కొంత ఇవ్వాలని మేము ఎవరినీ అడగలేదు. అంత స్థాయికి మేము ఇంకా దిగజారిపోలేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు నిర్మాతపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

‘గేమ్ ఛేంజర్’ విషయంలో నిర్మాతల వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటన సినీ పరిశ్రమలోని సంబంధాలపై ప్రశ్నార్థకాలు రేపుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.