|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను అతను వేధిస్తున్నా నాతో పని చేసిన ఆ హీరో, డైరెక్టర్ పట్టించుకోలేదు: గౌరీ కిషన్

Published: 07-11-2025, 11:19 PM
నన్ను అతను వేధిస్తున్నా నాతో పని చేసిన ఆ హీరో, డైరెక్టర్ పట్టించుకోలేదు: గౌరీ కిషన్

ఇటీవల ప్రెస్‌మీట్‌లో నటి గౌరీ కిషన్‌ను ఓ యూట్యూబర్ బాడీ షేమింగ్ చేశాడు. ఈ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించింది. ప్రజలు, సెలబ్రిటీలు మద్దతు ప్రకటించినా, తనతో కలిసి పనిచేసిన హీరో, డైరెక్టర్ స్పందించకపోవడంపై గౌరీ కిషన్ నిరాశ వ్యక్తం చేసింది.

Key Points

1

ప్రెస్‌మీట్‌లో గౌరీ కిషన్‌ను యూట్యూబర్ బాడీ షేమింగ్ చేశాడు.

2

తన బరువు గురించి అడిగినందుకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది.

4

సహచర హీరో, డైరెక్టర్ తనకు మద్దతు ఇవ్వకపోవడంపై గౌరీ ఆవేదన.

గౌరీ కిషన్‌పై బాడీ షేమింగ్ వివాదం

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గౌరీ కిషన్ (Gauri Kishan)పేరే మార్మోగిపోతోంది. ఇటీవల ‘అదర్స్’ (Others)మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమెను ఓ రిపోర్టర్ బాడీ షేమింగ్ చేసిన విషయం తెలిసిందే. తన బరువు గురించి అడగడంతో.. వెంటనే గౌరీ కిషన్ ఫైర్ అయిపోయింది. నా బరువు గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు.. మీకు నా సినిమాలు కావాలి కానీ బరువు ఎందుకు.. ఒక హీరోయిన్‌ను ఇలాంటి ప్రశ్న అడగడం ఏంటని మండిపడింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.

హీరో, డైరెక్టర్ స్పందనపై గౌరీ నిరాశ

ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, సినీ సెలబ్రిటీలు సైతం ఈ విషయాన్ని ఖండిస్తూ రిపోర్టర్‌ను బండబూతులు తిడుతున్నారు.సెలబ్రిటీలు కూడా గౌరీకి సపోర్ట్ చేస్తూ.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ నాతో పని చేసిన హీరో ఆదిత్య మాధవన్, డైరెక్టర్ అభిన్ హరికరణ్ ఈ విషయంపై స్పందించలేదు. తాజాగా, ఈ విషయాన్ని వెల్లడిస్తూ గౌరీ ఎమోషనల్ అయింది.

సోషల్ మీడియాలో సెలబ్రిటీల మద్దతు

‘‘నిన్న అక్షరాలా ఒక వేధింపులు జరిగాయి. నన్ను ఆ ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టిన వ్యక్తి జర్నలిస్ట్ కాదు, యూట్యూబర్ అని తెలిసింది. ఒకవేళ జర్నలిస్ట్ అయినా అతను జర్నలిజం నుండి నిష్క్రమించాలి. ఆ సమయంలో నా హీరో/డైరెక్టర్ నాకు సపోర్ట్‌గా నిలబడలేదని నేను నిరాశ చెందాను. కానీ అది వారి ఇష్టం. సోషల్ మీడియాలో ప్రజలు & సెలబ్రిటీలు నాకు మద్దతు ఇస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పింది. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

గౌరీ కిషన్‌పై జరిగిన బాడీ షేమింగ్, తన సహచరుల మద్దతు లేకపోవడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇలాంటి ఘటనలపై సినీ పరిశ్రమ స్పందించాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.