
📌 Key Points
- గూగుల్ జెమిని AIతో జీమెయిల్‌లో కన్వర్సేషనల్ వాయిస్ ఫీచర్ టెస్టింగ్
- టైప్ చేయకుండానే వాయిస్ ద్వారా ఈమెయిళ్లను సెర్చ్, చదవడం, సమ్మరైజ్ చేయడం
- హ్యాండ్స్-ఫ్రీ అనుభవం, డ్రైవింగ్ సమయంలో ఉపయోగపడే అవకాశం
- Google AI Pro, AI Ultra & Workspace యూజర్లకు త్వరలో రోల్ అవుట్
గూగుల్ తన అత్యాధునిక ఏఐ మోడల్ జెమినిని ఉపయోగించి జీమెయిల్ సర్వీస్‌లో కొత్త కన్వర్సేషనల్ వాయిస్ ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. టైప్ చేయకుండానే వాయిస్ కమాండ్స్ ద్వారా ఈమెయిళ్లను నిర్వహించే ఈ ఫీచర్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
జెమిని AIతో జీమెయిల్‌లో కొత్త వాయిస్ ఫీచర్
గూగుల్‌కు సంబంధించిన అత్యాధునిక ఏఐ మోడల్ జెమిని(Gemini)ని గురించి తెలిసిందే. సమాచార సేకరణలో, అనుమానాల నివృత్తిలో ఇది యూజర్లకు ఎంతో ఉపయోగపడుతున్నది. అయితే తాజాగా మరో అప్డేట్‌తో మన ముందుకు వచ్చింది. ఏంటంటే.. గూగుల్ తన జెమినీ ఏఐని ఉపయోగించి జీమెయిల్ (Gmail) సర్వీస్‌లో కొత్త తరహా కన్వర్సేషనల్ వాయిస్ ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. ఇంతకీ దీని పనితీరు ఏమిటి? ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ ప్రవేశపెట్టబోయే కొత్త కన్వర్జేషనల్ వాయిస్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఇన్‌బాక్స్‌తో సహజమైన పద్ధతిలో (Natural Language) మాట్లాడవచ్చు. ఏమాత్రం టైప్ చేయకుండానే.. కేవలం వాయిస్ కమాండ్స్ ఇచ్చి ఈమెయిళ్లను సెర్చ్ చేయడం, చదవడం, సమ్మరైజ్ చేయడం, రిప్లయ్ ఇవ్వడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. పైగా ఇది హ్యాండ్స్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తూ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. Google AI Pro, AI Ultra & Google Workspace యూజర్లకు త్వరలో రోల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. అందుబాటులోకి వస్తే.. దీని ద్వారా ఈ-మెయిల్ నిర్వహణ మరింత సులభంగా, వేగవంతంగా మారనుంది. ముఖ్యంగా బిజీగా ఉండే వ్యక్తులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
వాయిస్ కమాండ్స్‌తో ఈమెయిల్ నిర్వహణ ఎలా?
ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ఈ కొత్త వాయిస్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో Google AI Pro, AI Ultra & Workspace యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఈమెయిల్ నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది.


