
కెరీర్ పీక్స్‌లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన జెనీలియా, ‘వేద్’ తర్వాత మళ్ళీ సినిమాల్లో సందడి చేస్తోంది. తాజాగా ఆమె పని గంటలపై చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Key Points
జెనీలియా రోజుకు 10 గంటలు షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఆమె వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని సమతుల్యం చేయడం కష్టమే కానీ అసాధ్యం కాదని అన్నారు.
జెనీలియా తాజా చిత్రం 'సితారే జమీర్ పర్' జూన్ 20న విడుదల కానుంది.
నెటిజన్లు జెనీలియా వ్యాఖ్యలను దీపిక పదుకొనే వ్యాఖ్యలతో పోల్చి చూస్తున్నారు.
జెనీలియా పని గంటలు మరియు వ్యక్తిగత జీవితం
ఒకప్పుడు యూత్ కలల రాణిలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన జెనీలియా (Genelia).. కెరీర్ పీక్స్‌లో ఉండగానే రితేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరం అయ్యింది. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత సెకిండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘వేద్’ మూవీతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన జెనిలీయా.. ప్రస్తుతం ఆమిర్ ఖాన్(Aamir Khan)తో ఓ మూవీ చేస్తుంది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ‘సితారే జమీర్ పర్’ (Sitare Jameer Par) అనే సినిమాలో ఆమీర్ ఖాన్ హీరో కాగా.. జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్‌గా నటిస్తుంది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్(Sports backdrop)లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జూన్ 20న రిలీజ్ కాబోతుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా పని గంటలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీరు ఎక్కువ టైమ్ షూటింగ్‌లో ఉంటే.. మీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనే ప్రశ్నపై జెనీలియా స్పందిస్తూ.. ‘నేను రోజుకు 10 గంటలు షూటింగ్‌లో ఉంటాను. అయితే.. ఇది కష్టమే కానీ అసాధ్యం కాదు’ అని తెలిపింది. దీంతో జెనీలియా కామెంట్స్‌ను దీపికా పదుకొనే (Deepika Padukone) కామెంట్స్‌తో కంపేర్ చేస్తూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
‘సితారే జమీర్ పర్’ చిత్ర ప్రమోషన్లు
నెటిజన్ల ప్రతిస్పందనలు
జెనీలియా తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి. నెటిజన్ల ప్రతిస్పందనలు ఆమెకు మరింత ప్రేరణనిస్తాయని ఆశిద్దాం.


