
డిసెంబర్‌లో విడుదల కానున్న పదుల సంఖ్యలో చిత్రాల్లోకి అరుణ్ విజయ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రెట్టతల’ కూడా చేరింది. ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. ఈ తుఫానును మిస్ అవ్వకండి అని మేకర్స్ ప్రకటించారు. మరింత సమాచారం కోసం చదవండి.
Key Points
అరుణ్ విజయ్ నటించిన 'రెట్టతల' చిత్రం డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల.
క్రిస్ తిరుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది.
తాన్య రవిచంద్రన్, సిద్ధి ఇద్నానీ హీరోయిన్లుగా నటించారు.
బీటీజీ యూనివర్శల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాబీ బాలచంద్రన్ సమర్పణలో నిర్మిస్తున్నారు.
‘రెట్టతల’ రిలీజ్ డేట్ ఖరారు
యంగ్ హీరోల కానుంచి స్టార్స్ వరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. నెలకు కనీసం అరడజన్ చిత్రాలైనా థియేటర్స్‌కు వస్తున్నాయి. కానీ చాలా మూవీస్ జనాల ఆదరణ పొందలేక.. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. మరికొన్ని చిన్న చిత్రాలుగా వచ్చి ఊహించని రెస్పాన్స్‌తో లాభాలు తెచ్చిపెడుతున్నారు. ఇక ఇప్పటికే నవంబర్‌లో విడుదలైన చిత్రాలు అంతంత మాత్రంగానే మెప్పిస్తున్నాయి. ఇక డిసెంబర్‌లో మాత్రం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కాబోతున్నాయి. అన్ని చిత్రాలు క్రిస్మస్ కానుకగా రాబోతుండటం గమనార్హం.
ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో మూవీ చేరింది. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్(Arun Vijay) నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రెట్టతల’(RettaThala ). క్రిస్ తిరుకుమారన్(Chris Thirukumaran) దర్శకత్వంలో రాబోతుండగా.. బాబీ బాలచంద్రన్ సమర్పణలో బీటీజీ యూనివర్శల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో తాన్య రవిచంద్రన్, సిద్ధి ఇద్నానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మేకర్స్ పోస్ట్ పెట్టారు. ‘‘రెట్టింపు యాక్షన్స్, రెట్టింపు థ్రిల్స్ కోసం సిద్ధంగా ఉండండి. ‘రెట్టతల’ డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. ఈ తుఫానును మిస్ అవ్వకండి’’ అని తెలిపారు.
డిసెంబర్ లో వస్తున్న చిత్రాలు
‘రెట్టతల’ చిత్ర బృందం
మొత్తానికి అరుణ్ విజయ్ ‘రెట్టతల’ చిత్రం డిసెంబర్ 18న విడుదలవుతుండటంతో ప్రేక్షకులు రెట్టింపు యాక్షన్, థ్రిల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో చూడాలి.


