|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జీమెయిల్‌లో వాట్సాప్ సెక్యూరిటీ విప్లవం! మీ మెయిల్స్ ఇక పదిలం!!

Published: 11-04-2026, 6:05 AM
జీమెయిల్‌లో వాట్సాప్ సెక్యూరిటీ విప్లవం! మీ మెయిల్స్ ఇక పదిలం!!
  • జీమెయిల్‌లో వాట్సాప్ తరహా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
  • ఆండ్రాయిడ్, iOS యూజర్లకు ఈ సెక్యూరిటీ ఫీచర్ ఉపయోగపడుతుంది.
  • గూగుల్ వర్క్‌స్పేస్ ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
  • ఈ ఫీచర్ వినియోగానికి అడ్మిన్ కన్సోల్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలి.

జీమెయిల్ యూజర్లకు శుభవార్త! వాట్సాప్ తరహాలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీ ఈమెయిల్‌లను మరింత సురక్షితంగా పంపుకోవచ్చు.

జీమెయిల్‌లో కొత్త ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్

Gmail Whatsapp Feature : జీమెయిల్ వాడే ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం ఎండ్-టు-ఎండ్ సెక్యూరిటీతో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఈ సెక్యూర్ సర్వీసు వాట్సాప్, టెలిగ్రామ్ మాదిరిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందిస్తుంది. పూర్తి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..

Gmail Whatsapp Feature : జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీరు జీమెయిల్ ఎవరికి పంపినా ఫుల్ సెక్యూర్ ఉంటుంది. జీమెయిల్‌లో కూడా వాట్సాప్ మాదిరి సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది. ఈ మేరకు గూగుల్ ఒక కీలక ప్రకటన చేసింది. జీమెయిల్ యూజర్లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు రెండింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఇప్పటికే వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఈ కొత్త సెక్యూర్ ఫీచర్ అందరి యూజర్లకు అందుబాటులో లేదు. ఈ సెక్యూర్ ఫుల్ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చాక ఇమెయిల్‌ పంపేందుకు అదనపు సెక్యూరిటీ అవసరం లేదు. అదనపు సాఫ్ట్‌వేర్ లేదా ఎక్స్‌టెన్షన్‌ కూడా అవసరం ఉండదు. ఇమెయిల్‌లు సెక్యూర్ డెలివరీ అవుతాయి.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే ఏమిటి?

Read Also : Apple Days Sale : ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఈ ఆపిల్ ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఇలాంటి డీల్స్ మళ్లీ రావు..!

ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఏంటి? ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది ప్రాథమికంగా ఒక డిజిటల్ సెక్యూరిటీ లాక్ సిస్టమ్. ఈ టెక్నాలజీతో ఏదైనా మెసేజ్ లేదా డేటాను పంపినవారు లేదా స్వీకరించినవారు తప్ప మరెవరూ ఒక ఇమెయిల్ లేదా మెసేజ్ ట్రాక్ చేయలేరు.

ఆండ్రాయిడ్ iOS డివైజ్‌లకు జీమెయిల్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సపోర్ట్‌ను విస్తరిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ అప్‌డేట్ ద్వారా యూజర్లు ఇప్పుడు జీమెయిల్ మొబైల్ యాప్ నుంచి నేరుగా ఎన్‌క్రిప్ట్ చేసిన ఈమెయిల్‌లను కంపోజ్ చేయడం, పంపడం, చదవడం చేయొచ్చు.

ఈ ఫీచర్ ఎవరికి ఉపయోగపడుతుంది?

ఈ యూజర్లకు బెనిఫిట్ : క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్ అందించే గూగుల్ వర్క్‌స్పేస్ ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ ఫీచర్ యాక్సెస్ చేసేందుకు ముందుగా అడ్మిన్ కన్సోల్ ద్వారా ఆండ్రాయిడ్ iOS సపోర్ట్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.

ర్యాపిడ్ రిలీజ్, షెడ్యూల్డ్ రిలీజ్ డొమైన్‌లు రెండింటిలోనూ ఈ అప్‌డేట్ వచ్చిందని గూగుల్ పేర్కొంది. మొబైల్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందుబాటులోకి వచ్చాక వినియోగదారులు ఎక్కడి నుంచైనా సెక్యూర్‌గా యాక్సెస్ చేయొచ్చు. గతంలో, ఎన్‌క్రిప్టెడ్ ఈమెయిల్ కోసం డెస్క్‌టాప్ లేదా థర్డ్-పార్టీ టూల్స్ వాడాల్సి వచ్చేది.

జీమెయిల్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ రావడం వల్ల యూజర్ల డేటాకు మరింత భద్రత లభిస్తుంది. ఇది డిజిటల్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.