
📌 Key Points
- ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటీ, నీట్ శిక్షణకు నారా లోకేష్ ఆదేశం.
- నాలుగు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక కోచింగ్ కేంద్రాల ఏర్పాటు.
- మన బడి-మన భవిష్యత్తు కింద రూ. 2,034 కోట్ల నిధుల సమీకరణ.
- నైపుణ్యాభివృద్ధి ద్వారా 1.95 లక్షల మందికి ఉపాధి కల్పన.
విద్యార్థులకు ఒక గొప్ప శుభవార్త! ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఐఐటీ, నీట్‌పై ప్రత్యేక శిక్షణకు ఆదేశాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించేందుకు వీలుగా ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల పనితీరును సమీక్షిస్తూ.. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ఒక ప్రాధాన్యత అని మంత్రి అన్నారు. అధికారులు నాలుగు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ప్రతి ప్రాంతంలోని నాలుగు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రత్యేక కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపు 70 శాతం పూర్తయిందని అధికారులు మంత్రికి తెలిపారు. విద్యా సంవత్సరం బుధవారం ప్రారంభం కాగా.. మొదటి సంవత్సరం ప్రవేశాలు ఏప్రిల్ 6 నుంచి మొదలవుతాయి. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు ఏప్రిల్ 19లోగా ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
ఇంటర్మీడియట్ స్థాయిలో డ్రాపౌట్లు లేకుండా చూడాలని, విద్యార్థులు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కనీస సౌకర్యాలు కల్పించి, వాటిని కనీసం త్రీ-స్టార్ రేటింగ్‌కు అప్‌గ్రేడ్ చేయాలని కూడా పిలుపునిచ్చారు.
విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు
మన బడి-మన భవిష్యతు కార్యక్రమం కింద రూ. 2,034 కోట్ల నిధులను సమీకరిస్తున్నామని, ఇందులో భాగంగా రూ. 770 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని లోకేశ్ చెప్పారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో ఏమాత్రం లోపం కనిపించినా చర్యలు తీసుకుంటామని, ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని లోకేష్ అధికారులను హెచ్చరించారు.
అడల్డ్ ఏజ్ ఎడ్యుకేషన్‌పై సమీక్షిస్తూ.. ఈ ఏడాది 24.74 లక్షల మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, దీంతో అక్షరాస్యత రేటు 73 శాతం నుంచి 83 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది నాటికి సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం
నైపుణ్యాభివృద్ధి రంగంలో ఇప్పటివరకు 1.95 లక్షల మందికి ఉపాధి లభించిందని, 6.87 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్టుగా, ప్రస్తుతం 71,000 మందికి పైగా శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో అమరావతిలో ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. జాతీయ నిర్మాణ అకాడమీ ఆధ్వర్యంలో అమరావతి లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, మంగళగిరిలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా లోకేశ్ సమీక్షించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మొత్తానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చర్యలు విద్యార్థులకు ఎంతో మేలు చేసేలా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.


