
📌 Key Points
- గల్ఫ్ యుద్ధం కారణంగా ప్రపంచ పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం.
- కోడి గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు భారీగా పతనం.
- పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది.
- తమిళనాడు, తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పై యుద్ధ ప్రభావం.
గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంపై దీని ప్రభావం అధికంగా ఉంది. కోడి గుడ్ల ధరలు భారీగా పడిపోవడంతో పరిశ్రమ నష్టాల బాట పట్టింది.
యుద్ధ ప్రభావంతో కుదేలైన పౌల్ట్రీ రంగం
ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా దేశాలు గతవారం రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులు, కీలక నాయకులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకారం కట్టలు తెంచుకుంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. గత ఆరు రోజుల నుంచి భీకర యుద్ధం కొనసాగుతుంది. దీని కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్త పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. ఎక్కడికక్కడ ఎగుమతులు నిలిచిపోవడంతో పాటు కోడి గుడ్డు ధరలు భారీగా పడిపోయాయి. తద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి పోర్ట్‌లు, ఎయిర్‌పోర్టుల మూసివేతే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ ధర రూ.4.30 ఉండగా.. స్థానిక మార్కెట్లలో రూ.3.30కి పడిపోయింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పైనా ప్రభావం పడింది.
భారీగా పడిపోయిన కోడి గుడ్డు ధరలు
తెలుగు రాష్ట్రాలపై యుద్ధ ప్రభావం
గల్ఫ్ యుద్ధం కారణంగా కోడి గుడ్డు ధరలు పడిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. యుద్ధం ఎంతకాలం కొనసాగితే, ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.


