|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: 40 లక్షల కోసం రోహిణి వేట- భర్త లవర్ కోసం ఏజెన్సీలో వెతుకులాట- మనోజ్ బిజినెస్ కోసం బాలు సాయం

Published: 01-08-2025, 8:14 PM
గుండె నిండా గుడి గంటలు: 40 లక్షల కోసం రోహిణి వేట- భర్త లవర్ కోసం ఏజెన్సీలో వెతుకులాట- మనోజ్ బిజినెస్ కోసం బాలు సాయం

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో రోహిణి 40 లక్షలు కోసం వేటాడుతుండగా, మనోజ్ తన భార్య ప్రేమికుడి కోసం ఏజెన్సీ సహాయం తీసుకుంటున్నాడు. బాలు మనోజ్ వ్యాపారానికి సహాయపడుతున్నాడు. ఈ ఎపిసోడ్‌లో చాలా ఉత్కంఠభరితమైన ట్విస్ట్స్ ఉన్నాయి.

Key Points

1

రోహిణి 40 లక్షల కోసం వేట ప్రారంభించింది.

2

మనోజ్ భార్య లవర్‌ను ఏజెన్సీ ద్వారా వెతుకుతున్నాడు.

4

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ట్విస్ట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

రోహిణి 40 లక్షల కోసం వేట

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో మీనా, బాలు బంధాన్ని చూసి ఆలోచిస్తుంటాడు మనోజ్ . ఇంతలో రోహిణి వచ్చి ఏమైందని అడుగుతుంది. మీనా, బాలు ఒకరినొకరు ఎంతో అర్థం చేసుకుంటున్నారు, శ్రుతి రవి కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు రవి రెస్టారెంట్ పెడతానంటే వాళ్ల మావయ్య వెంటనే డబ్బు అరెంజ్ చేస్తాడు అని మనోజ్ చెబుతాడు.

నేను బిజినెస్‌లో బాగా ఎదుగుతానని నాకు నమ్మకం ఉంది. మీ నాన్నను డబ్బు అరెంజ్ చేయమని చెప్పొచ్చుగా అని రోహిణిని మనోజ్ అంటాడు. ఆయన జైలులో ఉన్నారుగా. అసలు నువ్ నన్ను డబ్బు చూసి ప్రేమించావా, నన్ను చూసి ప్రేమించావా. నువ్ ప్రతిసారి డబ్బు గురించి అడిగితే నాకు బాధేస్తుందని రోహిణి చెబుతుంది.

దాంతో రోహిణిని మనోజ్ బతిమిలాడుతాడు. నిన్ను చూసే ప్రేమించానని చెబుతాడు. అసలు మావయ్య నీకు ఇచ్చిన డబ్బును నీ నుంచి కొట్టేసిన అమ్మాయి పేరు ఏంటీ అని రోహిణి అడుగుతుంది. దాంతో గతమంతా గుర్తు చేసుకుంటాడు మనోజ్. కల్పన అనే అమ్మాయిని మనోజ్ లవ్ చేయడం, ఒక్కటి కావడం, సత్యం ఇచ్చిన డబ్బుతో మనోజ్ తలపై కొట్టి పారిపోవడం అంతా గుర్తు చేసుకుంటాడు.

మనోజ్, భార్య లవర్ కోసం వెతుకులాట

తన పేరు కల్పన అని రోహిణికి చెబుతాడు మనోజ్. తను ఏ దేశానికి వెళ్లిన ఏదో ఒక ఏజెన్సీ ద్వారా వెళ్తుంది. అది తెలుసుకుని వాళ్లను డీటేల్స్ అడిగితే ఏ కంట్రీలో ఉన్న అక్కడి పోలీసులకు చెప్పి పట్టుకోవచ్చు అని రోహిణి చెబుతుంది. అది జరిగి చాలా రోజులు అవుతుందిగా. ఇప్పుడు పాజిబుల్ అవుతుందా అని మనోజ్ అనుమానం వ్యక్తం చేస్తాడు.

గట్టిగా ప్రయత్నిస్తే పాజిబుల్ అవుతుందని ధైర్యం చెబుతుంది రోహిణి. మనసు లోపల ఆ రూ. 40 లక్షలు దొరికితే ఈ డబ్బు సమస్యలన్ని తీరిపోతాయని మనసులో అనుకుంటుంది రోహిణి. అలా 40 లక్షల కోసం రోహిణి, మనోజ్ వేట ప్రారంభిస్తారు. ఆ డబ్బు ఉన్న కల్పన కోసం వెతుక్కుంటూ ఓ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తారు ఇద్దరు భార్యాభర్తలు.

ఒకరి గురించి డీటెల్స్ కావాలి. నేను లాస్ట్ మార్చిలో టికెట్ బుక్ చేశాను. ఈ అమ్మాయి అడ్రస్ కావాలని కల్పన ఫొటో చూపిస్తాడు మనోజ్. ఆ ఫొటో చూసిన రిసెప్షనిస్ట్ కచ్చితంగా మీకు అడ్రస్ పంపిస్తాను అని హామీ ఇస్తుంది. దాంతో మనోజ్, రోహిణి సంతోషిస్తారు. తర్వాత కల్పన అడ్రస్ దొరకలేదని, తను ఇచ్చింది ఫేక్ అడ్రస్ అని మనోజ్, రోహిణికి చెబుతుంది రిసెప్షనిస్ట్.

బాలు మనోజ్‌కు బిజినెస్‌లో సహాయం

దాంతో ఉన్న ఒక్క అవకాశం పోయిందే అని మనోజ్, రోహిణి బాధపడుతారు. మరోవైపు ఇండియాలోనే బాలు కారులో కల్పన ప్రయాణిస్తుంది. కల్పనను ఓ చోట బాలు డ్రాప్ చేయడం మనోజ్ చూసి షాక్ అవుతాడు. అదే విషయం రోహిణికి చెబుతాడు. ఇద్దరు కలిసి బాలు దగ్గరికి వెళ్తారు. కానీ, ఇంతలోనే కల్పన వెళ్లిపోతుంది.

బాలు కు కల్పన గురించి చెప్పి తనను పట్టుకుంటే 40 లక్షలు వస్తాయని మనోజ్ చెబుతాడు. ఆ 40 లక్షలు వస్తే మనోజ్ గాడు తన కాళ్ల మీద తాను నిలబడతాడు, ఏదో బిజినెస్ పెట్టుకుంటాడని ఆలోచించి అన్నయ్య కోసం సహాయం చేయడానికి బాలు ఒప్పుకుంటాడు.

కల్పన ఎక్కడ ఎక్కింది, ఎక్కడ దిగింది అన్ని ఆరా తీసిన బాలు ఫైనల్‌గా కల్పనను పట్టుకుంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

రోహిణి మరియు మనోజ్ 40 లక్షలు కోసం తమ వెతుకులాటను కొనసాగిస్తారు. కల్పనను కనుగొనడానికి వారు ఎలా ప్రయత్నిస్తారో మరియు వారి ప్రయత్నం విజయవంతం అవుతుందో లేదో తెలియాలంటే సీరియల్‌ను చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.